AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Returns: స్టాక్ మార్కెట్ గందరగోళంలోనూ దూసుకుపోతున్న స్టాక్ ఇదే.. ఎంత పెరిగిందంటే..

Multibagger Returns: లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి కేవలం రెండున్నర నెలల్లో ఆ కంపెనీ షేరు ఏకంగా రూ. 7 లక్షలు లాభాన్ని అందించింది. ఈ కంపెనీ ఎడ్యుకేషన్ విభాగంలో వ్యాపారం చేస్తోంది.

Multibagger Returns: స్టాక్ మార్కెట్ గందరగోళంలోనూ దూసుకుపోతున్న స్టాక్ ఇదే.. ఎంత పెరిగిందంటే..
stock market
Ayyappa Mamidi
| Edited By: Srinivas Chekkilla|

Updated on: Mar 17, 2022 | 5:27 PM

Share

Multibagger Returns: లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి కేవలం రెండున్నర నెలల్లో ఆ కంపెనీ షేరు ఏకంగా రూ. 7 లక్షలు లాభాన్ని అందించింది. ఈ కంపెనీ ఎడ్యుకేషన్(Education stock) విభాగంలో వ్యాపారం చేస్తోంది. అదే షాంతి ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్(Shanti Educational Initiatives) కంపెనీ రెండన్నర నెలల క్రితం రూ. 99 ఉండేది. తాజాగా దీని మార్కెట్ విలువ రూ. 787కు చేరింది. యుద్ధ భయాల సమయంలో కేవలం 51 ట్రేడింగ్ సెషన్లలో 687% మేర వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1267 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ 2021-22 ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో రెండింటిలో నష్టాలను నమోదు చేసింది. ఈ షేర్ తన 52 వారాల గరిష్ఠమైన రూ. 826 ని తాకగా.. 52 వారాల కనిష్ఠమైన రూ.83 ను తాకింది.

కంపెనీ స్టాండ్‌లోన్ నికర నష్టాన్ని రూ. 0.63 కోట్లుగా డిసెంబర్ 2021తో ముగిసే త్రైమాసికానికి నమోదు చేసింది. ఈ నష్టం డిసెంబర్ 2020 ఇదే త్రైమాసికానికి రూ. 1.19 కోట్లుగా ఉంది. షేరు ధర రికార్డు స్థాయిలో పెరగడానికి, షేరు కొనుగోళ్లు విపరీతంగా పెరగడానికి ఎటువంటి ప్రత్యేక కారణం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో పోటీదారుడైన Zee Learn 23 శాతం నెగటివ్ రాబడిని అందించింది.

గమనిక: మల్టీబ్యాగ్ స్టాక్ లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్న అంశం. పెట్టుబడిపై నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

ఇవీ చదవండి..

Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో కుంభకోణం.. ఎన్నివేల కోట్లంటే..

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..