Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో కుంభకోణం.. ఎన్నివేల కోట్లంటే..

Bank Fraud: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కు (PNB) వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక ఎన్పీఏ ఖాతాలో రూ.2,060 కోట్ల భారీ మోసపూరితమైన రుణం వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది.

Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో కుంభకోణం.. ఎన్నివేల కోట్లంటే..
Pnb
Follow us

|

Updated on: Mar 17, 2022 | 6:36 AM

Bank Fraud: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కు (PNB) వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక ఎన్పీఏ ఖాతాలో రూ.2,060 కోట్ల భారీ మోసపూరితమైన రుణం వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌ ఖాతాను నిరర్థక రుణ ఖాతా (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. దిల్లీ జోనల్‌ ఆఫీస్‌ పరిధిలోని ‘ఎక్స్‌ట్రా లార్జ్‌ కార్పొరేట్‌ బ్రాంచ్‌’ పరిధిలో ఈ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఖాతాకు సంబంధించి ఆర్‌బీఐకి తెలియజేసినట్లు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాకు రూ.824 కోట్ల కేటాయింపులు చేసినట్టు పేర్కొంది.

పీఎన్‌బీ కంటే ముందే పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించింది. రూ.148 కోట్ల రుణాన్ని ఎన్‌పీఏగా ప్రకటించి ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక  సంస్థే ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌. తమిళనాడులోని కడలూర్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల అమలుకు దీనిని ఏర్పాటు చేసింది.

మూడు విభాగాలు..

నిర్ణీత కాలవ్యవధిలోపు రుణ చెల్లింపులు రాని ఖాతాలను ఎన్‌పీఏగా గుర్తించి ఆర్‌బీఐకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఏ–0 విభాగం కింద ఖాతాలను డిఫాల్ట్‌ కేసుగా పరిణిస్తారు. 30రోజులుగా రుణం అసలు, వడ్డీ చెల్లింపులు చేయని ఖాతాలు ఈ విభాగం కిందకు వస్తాయి. బకాయి మొత్తాన్ని చెల్లించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఎంఎస్‌ఏ–1 విభాగం కింద 31–60 రోజుల పాటు రుణ చెల్లింపులు చేయని (పూర్తిగా/పాక్షికంగా) ఖాతాలను చేరుస్తారు. ఎస్‌ఎంఏ–3 కింద 61–90 రోజుల పాటు రుణ చెల్లింపులు చేయని ఖాతాలకు వస్తాయి. ఈ ఖాతాల వివరాలను బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీ కి తెలియజేస్తాయి.

ఇవీ చదవండి..

Investment Plan: ఐదేళ్లలో రూ.10 లక్షలను సులువుగా రూ.14 లక్షలుగా మార్చుకోండి..!

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ నిలిపివేయండి.. రష్యాకి ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు..