డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే.. బయటకు వచ్చిన తొలి ఫోటో..!
అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో శనివారం రాత్రి జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అమెరికా మంత్రివర్గ సభ్యులందరూ హాజరయ్యారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో శనివారం రాత్రి (ఏప్రిల్ 26) జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అమెరికా మంత్రివర్గ సభ్యులందరూ హాజరయ్యారు. రెప్పాపాటులో ట్రంప్, జె.డి. వాన్స్ సురక్షితంగా బయటపడ్డారు.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం జరుగుతున్న బాల్‌రూమ్‌కు సరిగ్గా పైన ఉన్న గదిలో కాల్పులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది, వేదికపై ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను రక్షణ వలయంలోకి తీసుకుని తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అతిథులు భయాందోళనతో బల్లల కింద దాక్కున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, వారి కుటుంబ సభ్యులతో పాటు ట్రంప్ కేబినెట్ అంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, భద్రతా సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. విందు సమయంలో వైట్ హౌస్‌పై కాల్పులు జరిగాయని, అయితే ఎటువంటి గాయాలు కాలేదని ఒక క్యాబినెట్ సభ్యుడు చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది.
ఈ గందరగోళంపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఈ సాయంత్రం డిసిలో పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది.సీక్రెట్ సర్వీస్, భద్రతా సంస్థలు అత్యంత ధైర్యసాహసాలతో, చురుగ్గా పనిచేశాయి. కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను సూచించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా దీనిని రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించాం.” అని ట్రంప్ పేర్కొన్నారు.
1ST FOOTAGE OF TRUMP SHOOTER https://t.co/D33GaTMDEu pic.twitter.com/vBvhHtOnZa
— RT (@RT_com) April 26, 2026
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఇలాంటి ఘటన జరగడం అమెరికా భద్రతా వ్యవస్థపై చర్చకు దారితీసింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థలు ఈ కాల్పుల వెనుక ఉన్న కుట్రపై ఆరా తీస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
