AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వాషింగ్టన్‌ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం…!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తప్పుడు పనులను కూడా సమర్థించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనతో ఆయనకే పోటీ. అందుకే ట్రంప్‌ గురించి వచ్చే బ్యాడ్ న్యూస్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ కలిసి ఉన్న ఫోటోలు ఏకంగా వాషింగ్టన్‌ డీసీలో గోడలపై ప్రత్యక్షం కావడం ట్రంప్‌ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్‌గా మారింది.

Watch: వాషింగ్టన్‌ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం...!
Donald Trump , Jeffrey Epstein
Balaraju Goud
|

Updated on: Apr 26, 2026 | 9:19 AM

Share

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తప్పుడు పనులను కూడా సమర్థించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనతో ఆయనకే పోటీ. అందుకే ట్రంప్‌ గురించి వచ్చే బ్యాడ్ న్యూస్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ కలిసి ఉన్న ఫోటోలు ఏకంగా వాషింగ్టన్‌ డీసీలో గోడలపై ప్రత్యక్షం కావడం ట్రంప్‌ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్‌గా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వీడియోలు వాషింగ్టన్‌ డీసీలో బిల్డింగ్‌ గోడలపై ప్రదర్శితం కావడం సంచలనం రేపుతోంది. వాషింగ్టన్‌ డీసీ వెలుగుల్లో ట్రంప్‌ ఎప్‌స్టీన్‌లు కలిసి ఉన్న వీడియోలను ప్రదర్శించారు నిరసనకారులు. సాధారణంగా వాషింగ్టన్‌డీసీలో గోడలపై సాధారణంగా కళా ప్రదర్శనలు, రాజకీయ నినాదాలు, సామాజిక ఉద్యమాల పోస్టర్లు కనిపిస్తాయి. అలాంటి చోట డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్‌స్టీన్‌ వీడియోలు ప్రత్యక్షం కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల సంబంధాన్ని మరింత ముడిపెడుతూ పలు దృశ్యాలను, దాంతో పాటు కొన్ని పత్రాలను వాషింగ్టన్ హిల్టన్ భవనంపై ప్రదర్శించారు నిరసనకారులు. ఈ వీడియోలలో ఎప్‌స్టీన్‌కు సంబంధించి ఫోటోలు, పత్రాలతో పాటు, అతని ఈ-మెయిళ్లను చదివి వినిపించనట్లుగా ఉన్న ఆడియో కూడా ఉంది. వీటిని వాషింగ్టన్‌ డీసీ గోడలపై ప్రదర్శించిన కాసేపటికే జనం గుమిగూడిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్ల గురించి జనానికి తెలిసినా ఆ వీడియోలను జనం ఆసక్తిగా చూస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

వాషింగ్టన్‌ డీసీలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ట్రంప్‌ హాజరు కానున్న ఒక రోజు ముందు ఈ వీడియోలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us