US China War : 2025లో వార్ తప్పదా? ప్రపంచం త్వరలో మరో బీకర యుద్ధాన్ని చూడబోతుందా?

ప్రపంచం త్వరలో మరో బీకర యుద్ధాన్ని చూడబోతుందా? ఈసారి అగ్రదేశాలే తలపడబోతున్నాయా? అమెరికా సైన్యాన్ని అప్రమత్తం చేస్తూ ఆదేశాలు అందాయా?

US China War : 2025లో వార్ తప్పదా? ప్రపంచం త్వరలో మరో బీకర యుద్ధాన్ని చూడబోతుందా?
War
Follow us

|

Updated on: Jan 29, 2023 | 9:56 PM

ప్రపంచం త్వరలో మరో బీకర యుద్ధాన్ని చూడబోతుందా? ఈసారి అగ్రదేశాలే తలపడబోతున్నాయా? అమెరికా సైన్యాన్ని అప్రమత్తం చేస్తూ ఆదేశాలు అందాయా? సీనియర్ సైనికాధికారి వ్యాఖ్యల ఉద్దేశమేంటి? అసలేం జరుగుతోంది? ఆసక్తికర కథనాలు మీకోసం..

అమెరికా, చైనా మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు పీక్స్‌కు చేరాయి. వాణిజ్య యుద్ధం రూపంలో మరింత ముదిరాయి. ఇండో- పసిఫిక్‌లో చైనా దుశ్చర్యలతో పాటు తైవాన్‌పై ఆ దేశ వైఖరి అమెరికాకు చికాకు కలిగిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యానికి చెందిన ఓ సీనియర్‌ సైనికాధికారి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2025లో రెండు అగ్రదేశాల మధ్య యుద్ధం రాబోతుందన్నది వాటి సారాంశం.

2025లో ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందని యూఎస్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ మైక్‌ మినిహన్‌ అంచనా వేశారు. అయితే ఈ అంచనాలు అవుతాయా అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎయిర్ మొబిలిటి కమాండ్‌లో 50 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు, 500 విమానాలు ఉన్నాయి. సైనిక దళాలకు సంబంధించి రవాణా, ఇంధన సరఫరా ఈ కమాండ్‌ పర్యవేక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

అమెరికా, తైవాన్‌లో 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కమాండ్‌ సభ్యులకు మినిహన్‌ రాసిన లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆ సమయానికి అమెరికా ఇతర అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తైవాన్‌ విషయంలో ముందుకెళ్లడానికి దీన్ని అవకాశంగా మార్చుకుంటారని అంచనా వేశారు మినిహన్. అందుకే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆ దిశగా తీసుకుంటున్న కీలక చర్యలకు సంబంధించిన నివేదికను ఫిబ్రవరి ఆఖరు కల్లా నివేదించాలని ఆదేశించారు.

దీనిపై అమెరికా రక్షణశాఖ ఉన్నతాధికారి స్పందించారు. మినిహన్‌ వ్యాఖ్యలు అమెరికా రక్షణశాఖ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. చైనాతో సైనిక పోటీ తమ ముందున్న ప్రధాన సవాల్‌ అని అన్నారు వాయుసేన బ్రిగేడియల్‌ జనరల్‌ ప్యాట్రిక్‌ రైడ. స్వేచ్ఛాయుత, శాంతియుత ఇండో- పసిఫిక్‌ కోసం మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి పనిచేయడంపై తాము దృష్టి సారించామన్నారు.

అగ్రదేశాల మధ్య ఉన్న ట్రేడ్ వార్‌ యుద్ధానికి దారితీయొచ్చన్న అంచనాలు ప్రపంచ దేశాలకు ఆందోళన కల్గిస్తోంది. నిజంగా అమెరికా, చైనా మధ్య యుద్ధం జరిగితే తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..