మదురో భార్యను బెడ్ రూమ్ నుండి ఈడ్చుకెళ్లిన అమెరికా దళాలు.. నిజమేనా?
వెనిజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ ఇద్దరూ నిర్దోషులు అని అంగీకరించారు. సిలియా ఫ్లోర్స్ కోర్టులో హాజరు కాగానే ఆమె ముఖం, తలకు కట్టుతో కనిపించారు. ఆమె కుడి కంటిపై గాయం కనిపించింది. ఆమె ముఖం వాలి ఉంది. కిడ్నాప్ సమయంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని, వైద్య చికిత్స అవసరమని ఫ్లోర్స్ న్యాయవాది మార్క్ డొన్నెల్లీ కోర్టుకు తెలిపారు.

వెనిజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ ఇద్దరూ నిర్దోషులు అని అంగీకరించారు. సిలియా ఫ్లోర్స్ కోర్టులో హాజరు కాగానే ఆమె ముఖం, తలకు కట్టుతో కనిపించారు. ఆమె కుడి కంటిపై గాయం కనిపించింది. ఆమె ముఖం వాలి ఉంది. కిడ్నాప్ సమయంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని, వైద్య చికిత్స అవసరమని ఫ్లోర్స్ న్యాయవాది మార్క్ డొన్నెల్లీ కోర్టుకు తెలిపారు. సిలియా ఫ్లోర్స్ పక్కటెముక విరిగి ఉండవచ్చని కూడా న్యాయవాది కోర్టుకు నివేదించారు.
తన క్లయింట్ నిజమైన ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి పూర్తి శరీర ఎక్స్-రే చేయించుకోవాలని డొన్నెల్లీ డిమాండ్ చేశారు. నికోలస్ మదురో కూడా అతనితో పాటు కోర్టుకు హాజరై కొకైన్ దిగుమతి, ఆయుధ నేరాలతో సహా అనేక ఆరోపణలకు తాను నిర్దోషి అని అంగీకరించాడు. “నేను నిర్దోషిని. ఇక్కడ పేర్కొన్న ఏ ఆరోపణలలోనూ నేను దోషిని కాదు. నేను మంచి మనిషిని.” అని అన్నాడు. విచారణ సమయంలో, ఫ్లోర్స్ టేబుల్ వద్ద కూర్చోవడానికి సహాయం అవసరమైంది. మదురో నిలబడి స్పానిష్‌లో మాట్లాడినట్లు ది సండే గార్డియన్ కథనంలో పేర్కొంది.
కోర్టు గదిలో ఆ జంట ఉద్రిక్తంగా కనిపించారు. ఇద్దరూ కూర్చోవడం, లేవడం కష్టంగా అనిపించింది. మదురో తరచుగా తన భార్య వైపు చూస్తూ కనిపించారు. ఫ్లోర్స్ తన భర్త కంటే ప్రశాంతంగా కనిపించారు. వారి తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది కోర్టు. ఫ్లోర్స్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమెకు ఒంటిపై పగుళ్లు, తీవ్రమైన గాయాలు అయ్యాయని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నికోలస్ మదురో న్యాయవాది బారీ పొల్లాక్, మదురోకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వారికి సంరక్షణ అందించాలని పేర్కొన్నారు.
ఇదిలావుంటే, జనవరి 3, 2026న, అమెరికా వెనిజులాపై దాడి చేసి, నికోలస్ మదురో, అతని భార్యను అరెస్టు చేసింది. CNN కథ ప్రకారం, అమెరికా దళాలు వారిని బెడ్ రూమ్ నుండి బయటకు లాగుకొచ్చాయి. అక్కడి నుంచి అమెరికాకు తరలించాయి. అనంతరం వెనిజులా ఉపాధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
