AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasa: నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఓరియన్‌ రాకెట్‌.. ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నాసా

దాదాపు 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మానవాళి మళ్ళీ చంద్రుడి వైపు అడుగులు వేసింది. బుధవారం నలుగురు వ్యోమగాములతో కూడిన బృందాన్ని నాసా చంద్రుడిపైకి పంపింది.ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి వెళ్లిన ప్రతిష్టాత్మక వ్యోమనౌక చంద్రుని చుట్టూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. రెండేళ్లలో చంద్రుడిపై మనిషిని దించే లక్ష్యంతో చేపట్టిన ఈ మిషన్ నాసా ప్రయోగంలో ఒక కీలక మైలురాయి కానుంది.

Nasa: నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఓరియన్‌ రాకెట్‌.. ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నాసా
Artemis 2 Mission
Anand T
|

Updated on: Apr 02, 2026 | 10:09 AM

Share

అంతరిక్ష ప్రయోగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్టెమిస్-2 అనే ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను నింగిలోకి పంపింది. సుమారు 53 ఏళ్ల తర్వాత రెండోసారి చంద్రుడి దగ్గరకు ఆర్టెమిస్-2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు బయలుదేరారు. చంద్రుడికి 10 వేల 300 కిలో మీటర్ల సమీపం వరకు వెళ్లి 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించనుంది ఈ వ్యోమనౌక

ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్లు, బీచ్‌ల వద్ద గుమిగూడారు. ఇది 1960, 70వ దశకాల్లో జరిగిన ‘అపోలో’ మిషన్ల రోజులను గుర్తుకు తెచ్చింది. చంద్రుడిపై శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేయాలనే నాసా లక్ష్యంలో ఇది అతిపెద్ద అడుగు కానుంది.

యాత్ర అనంతరం ఈ వ్యోమనౌక పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయ్యేలా నాసా ప్లాన్ చేసింది.1972లో అపోలో-17 తర్వాత మనుషులు భూకక్ష్యను దాటి వెళ్తుండటం మళ్లీ ఇదే తొలిసారి. కమాండర్ రీడ్‌ వైజ్‌మాన్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఆర్టెమిస్-2లో మూన్‌ మిషన్‌కి వెళ్తున్నారు. ఈ టీమ్‌లో ఒక మహిళ కూడా ఉన్నారు. 2 లక్షల 48 వేల కిలోమీటర్లు ప్రయాణించి వీళ్లు చంద్రుడికి దగ్గరగా చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ భూమి వైపు తిరుగు ప్రయాణమై పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారు.

ఒకవేళ ఆటోమేటిక్ సిస్టమ్స్ విఫలమైతే, వ్యోమగాములు స్వయంగా క్యాప్సూల్‌ను ఎలా నియంత్రించాలో ఈ ప్రయాణంలో పరీక్షించనున్నారు. చంద్రుడిని దగ్గరగా చూడటమే కాకుండా, అంతరిక్షం నుండి సూర్యగ్రహణాన్ని కూడా వీరు చూడగలుగుతారు.

తొలి మానవాలి ప్రయోగం

అయితే నాసా గతంలో చేపట్టిన ‘ఆర్టెమిస్-1’ ప్రయోగంలో మనుషులు చంద్రుడిపైకి వెళ్లలేదు. కానీ ఈ సారి కానీ ఈ ‘ఆర్టెమిస్-2’లో వ్యోమగాములు ఉండటంతో, వారి కోసం అవసరమైన ఆక్సిజన్, నీరు, టాయిలెట్ వంటి సదుపాయాలను మొదటిసారిగా ఈ క్యాప్సూల్‌లో అమర్చారు. అందుకే ఈ మిషన్ ఎంతో సవాలుతో కూడుకున్నదిగా నాసా పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రేషన్ కార్డు ఉందా..? ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి డబ్బులు
రేషన్ కార్డు ఉందా..? ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి డబ్బులు
కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుందో తెలుసా?.. మీ కళ్ళు తెరిపించే కథ
కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుందో తెలుసా?.. మీ కళ్ళు తెరిపించే కథ
నిజం చెబుతున్నా.. అలాంటోడిని వదిలేస్తే, టీమిండియాకు దరిద్రమే..!
నిజం చెబుతున్నా.. అలాంటోడిని వదిలేస్తే, టీమిండియాకు దరిద్రమే..!
మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా..
మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా..
: విశాఖలో గుండె పగిలే విషాదం.. అర్ధరాత్రి బంధువులకు మెసేజ్..
: విశాఖలో గుండె పగిలే విషాదం.. అర్ధరాత్రి బంధువులకు మెసేజ్..
మళ్లీ పెరిగిన CNG ధరలు
మళ్లీ పెరిగిన CNG ధరలు
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..