హనుమాన్ చాలీసాలోని అష్ట సిద్ధులు.. మీ విజయానికి రహస్యాలు!

02 April 2026

Jyothi Gadda

మనం ప్రతిరోజూ పఠించే హనుమాన్ చాలీసాలో హనుమంతుడిని అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అని కొలుస్తాం. అంటే ఎనిమిది సిద్ధులను, తొమ్మిది నిధులను ప్రసాదించగలవాడని అర్థం. వాటి అర్థమేంటో చూద్దాం..

అణిమ (Anima): అణిమ అంటే అత్యంత సూక్ష్మ రూపం దాల్చడం. కెరీర్ ప్రారంభంలో లేదా కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మన అహాన్ని (Ego) పక్కన పెట్టి, విద్యార్థిలా ఒదిగి ఉండటం విజయానికి మొదటి మెట్టు.

 గరిమ (Garima): గరిమ అంటే స్థిరత్వం, బరువు. కష్టకాలంలో కృంగిపోకుండా, దృఢమైన వ్యక్తిత్వంతో నిలబడటం ఒక మేనేజర్ లేదా లీడర్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం.

లఘిమ (Laghima): లఘిమ అంటే తేలికపాటి రూపం. పనిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్‌గా ఉండటం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం దీని అర్థం.

ప్రాప్తి (Prapti): లక్ష్యాన్ని చేరుకోవడం. సరైన ప్లానింగ్‌తో అనుకున్న డెడ్‌లైన్స్‌ను అందుకోవడం, ఆశించిన ఫలితాలను సాధించడం దీని కిందకు వస్తుంది.

ప్రాకామ్యం (Prakamya): అనుకున్నది సాధించాలనే సంకల్ప బలం. మీ రంగంలో నిష్ణాతులు కావడానికి అవసరమైన పట్టుదలను ఇది సూచిస్తుంది.

ఈశిత్వం (Ishitava): ఇది నాయకత్వ లక్షణం (Leadership). ఒక టీమ్‌ను సమర్థవంతంగా నడిపించడం, అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడం.

వశిత్వం (Vashitava): వశిత్వం అంటే ఇతరులను ప్రభావితం చేయడం. మీ ఐడియాలను ఇతరులు మెచ్చేలా వివరించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఇతరులను ఒప్పించడం.

ఈ ఎనిమిది సిద్ధులు కేవలం అద్భుత శక్తులు మాత్రమే కాదు, ఇవి వ్యక్తి తన కెరీర్‌లో సక్సెస్ కావడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ అని హనుమాన్‌ చాలీసా వివరిస్తోంది. ప్రతి వ్యక్తి కెరీర్ విజయానికి అష్ట సిద్ధుల అన్వయం తప్పనిసరి.