AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెహ్రాన్‌‌పై విరుచుకుపడ్డ అమెరికా-ఇజ్రాయెల్.. గాయపడ్డ ఇరాన్ ముఖ్య సలహాదారు కమల్ ఖరాజీ!

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం మొదలై నెల రోజులకు పైగా గడిచినా, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈలోగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో, ఆ దేశ సర్వోన్నత నాయకుడి సీనియర్ సలహాదారు కమల్ ఖరాజీ గాయపడ్డారని ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ 'మెహర్' తెలిపింది.

టెహ్రాన్‌‌పై విరుచుకుపడ్డ అమెరికా-ఇజ్రాయెల్.. గాయపడ్డ ఇరాన్ ముఖ్య సలహాదారు కమల్ ఖరాజీ!
Iran Top Advisor Kamal Kharazi
Balaraju Goud
|

Updated on: Apr 02, 2026 | 7:07 AM

Share

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం మొదలై నెల రోజులకు పైగా గడిచినా, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈలోగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో, ఆ దేశ సర్వోన్నత నాయకుడి సీనియర్ సలహాదారు కమల్ ఖరాజీ గాయపడ్డారని ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ ‘మెహర్’ తెలిపింది.

మెహర్ కథనం ప్రకారం, “టెహ్రాన్‌లోని నివాస ప్రాంతాలపై జరిగిన అమెరికా-జియోనిస్ట్ దాడిలో డాక్టర్ కమల్ ఖరాజీ గాయపడ్డారు.” అని పేర్కొన్నారు. అయితే, ఆయన గాయాల తీవ్రతకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు. టెహ్రాన్‌లోని ఖరాజీ ఇల్లే ఈ దాడికి లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా, ఇరాన్ వార్తాపత్రికలు కూడా ఈ దాడిని ధృవీకరించాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు అధికంగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది.

కమల్ ఖరాజీ ఒక అనుభవజ్ఞుడైన ఇరానియన్ దౌత్యవేత్త. 1997 నుండి 2005 వరకు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఇరానియన్ నాయకత్వానికి కీలక సలహాదారుగా పనిచేస్తున్నారు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణ ప్రాంతీయ శత్రుత్వాన్ని గణనీయంగా తీవ్రతరం చేసింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ఇజ్రాయెల్, వివిధ గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. మార్చి నెల ప్రారంభంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఈ యుద్దాన్ని ఇరాన్ చాలా కాలం పాటు కొనసాగించగలదని, ప్రస్తుతానికి దౌత్యపరమైన పరిష్కారానికి ఆస్కారం లేదని ఖరాజీ అన్నారు.

ఇదిలావుంటే, మరింత మంది ఇరాన్ నాయకులను లక్ష్యంగా చేసుకుని చంపితే, అమెరికా టెక్నాలజీ కంపెనీలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించిందని అర్ధ-అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించిన కథనంతో ఈ సంఘటన ఏకకాలంలో జరిగింది. టెహ్రాన్‌పై జరిగిన ఈ తాజా దాడి, పశ్చిమ ఆసియాలో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us