Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు! నదిలో పడిపోయిన వంతెన.. వీడియో
మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్టేల్‌పౌ 7.7 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రం మయన్మార్‌లో ఉందని, దాని పొరుగు దేశాలలో కూడా ప్రకంపనలు సంభవించినట్లు జర్మనీలోని GFZ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది..

మయన్మార్, మార్చి 28: భారత్ పొరుగున ఉన్న మయన్మార్‌లో శుక్రవారం (మార్చి 28) భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఈ భూకంప ప్రకంపనలు 5 నిమిషాలకుపైగా కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకాక్‌లో కూడా కంపించిన భూమి. ఇక్కడ భూకంప తీవ్రత 7.3గా నమోదు. భూకంపం తీవ్రత కారణంగా భవనాలు కుప్పకూలాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రెండు సార్లు భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకోవడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
Earthquake of magnitude 7.2 on the Richter scale hits Myanmar, says National Center for Seismology. pic.twitter.com/k0RQVKfbsZ
— ANI (@ANI) March 28, 2025
తొలుత 7.7, అనంతరం 6.4 తీవ్రతతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోనూ బలమైన ప్రకంపనలు సంభవించాయి. భారీ భూకంసం తీవ్రత వల్ల మయన్మార్‌లోని మండలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయింది. అనేక భవనాలు కూడా కూలిపోయాయి.
#BREAKING: Buildings collapse in Bangkok, Thailand following magnitude 7.6 earthquake with an epicenter in Myanmar. pic.twitter.com/ry8ex88chW
— UA News (@UrgentAlertNews) March 28, 2025
Bangkok earthquake right now #bangkok #earthquake #bkknews #bkk #แผ่นดินไหว #deprem #myanmar
Myanmar’da 7.7 şiddetinde deprem meydana geldi… pic.twitter.com/9TtEGNutfg
— bahisşikayet (@Bahis_sikayetim) March 28, 2025
భూకంప కేంద్రం మయన్మార్‌లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల (30 మైళ్ళు) దూరంలో ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం ఉదయం 11.50 గంటల ప్రాంతంలో భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.