Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poison Garden: ప్రపంచంలోనే డేంజర్ గార్డెన్.. ప్రాణాలు హరించే విషం వెదజల్లే మొక్కలు ఎక్కడున్నాయో తెలుసా

Poison Garden: కొన్ని మొక్కలు చిన్న చిన్న క్రిములను మాంసాహారాన్ని తీసుకుంటాయని చదువుకున్నాం. మొక్కల్లో ప్రాణాలు పొసే ఔషధ గుణాలున్నాయని తెలుసు. అయితే కొన్ని మొక్కలు..

Poison Garden: ప్రపంచంలోనే డేంజర్ గార్డెన్.. ప్రాణాలు హరించే విషం వెదజల్లే మొక్కలు ఎక్కడున్నాయో తెలుసా
The Posion Garden
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 11, 2021 | 7:05 PM

Poison Garden: కొన్ని మొక్కలు చిన్న చిన్న క్రిములను మాంసాహారాన్ని తీసుకుంటాయని చదువుకున్నాం. మొక్కల్లో ప్రాణాలు పొసే ఔషధ గుణాలున్నాయని తెలుసు. అయితే కొన్ని మొక్కలు మనుషుల ప్రాణాలను సైతం హరించే గుణాన్ని కలిగి ఉన్నాయట. ఈ మొక్కలను పెంచుతున్న తోటలో ప్రాణాల మీద ఆశలు ఉన్నవారు అడుగు పెట్టరు.. ఎందుకంటే ఇక్కడి మొక్కలను తాకినా, వాసన చూసినా నరకం ఇక్కడే అనుభవిస్తారని అంటున్నారు. అదృష్టవంతులైతేనే ప్రాణాలతో బయటపడతారట. ఇంగ్లాండ్ లో ఉన్న ఈ మొక్క గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

నార్తంబర్ ల్యాండ్ లోని అల్న్ విక్ గార్డెన్ .. దీనికి వరల్డ్ డెడ్లియెస్ట్ గార్డెన్ గా పేరు.. ఈ గార్డెన్ లో పర్యటించాలనుకునే పర్యాటకులను ఒకటిగా సిబ్బంది వదిలేయారు.. వారితో పాటు ఒక గైడ్ కూడా ఉంటారు.. ఎందుకంటే పర్యాటకులు పొరపాటున కూడా ఈ గార్డెన్ లోని మొక్కలను తాకకుండా చూడడానికి. గతంలో ఈ గార్డెన్ లోకి వెళ్లిన కొంతమంది సందర్శకులు మూర్ఛపోయారు. వారు అక్కడ మొక్కల నుంచి వెలువడిన విషవాయువుల ప్రభావంతోనే మూర్ఛకు గురయ్యారని వైద్య పరీక్షల్లో తెలిసింది.

ప్రపంచంలో విషపు మొక్కలుంటాయని చెప్పడానికే ఈ గార్డెన్ ను ఏర్పాటు చేశారట.. అందుకనే ఈ తోటలో అడుగు పెట్టె సందర్శకులు మొక్కలను తాకకూడదు. ఒక వేళ సరదాగా ముట్టుకున్నా, వాసన చూసినా, నోట్లో పెట్టుకున్నా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. పర్యాటకుల క్షేమం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ గార్డెన్‌ను నిర్వహించే సిబ్బంది హజ్మత్ సూట్లు ధరించిన తర్వాతే గార్డెన్లో అడుగు పెడతారు.

మాములు మొక్కలను.. ఔషద మొక్కలను అందరూ పెంచుతారు.. అందుకనే తాము స్పెషల్ గా ఉండడానికి విషపు మొక్కలు పెంచుతున్నామని గార్డెన్ నిర్వాహకులు ట్రెవర్ జోన్స్ చెప్పారు. ఇక్కడ దాదాపు 100 వరకూ విషపు మొక్కలున్నాయని తెలిపారు. వీటిల్లో నీలం రంగు పువ్వులు పూసే మాంక్‌షుడ్ అనే ప్రమాద కరమైందని.. ఈ మొక్క కాయలు, ఆకులు, కాండానికి కూడా ప్రాణాలను తీసే శక్తి ఉందని చెప్పారు. ఈ గార్డెన్ లోని కొన్ని మొక్కలు ఆక్సిజన్ బదులు విషాన్ని వదులుతాయి. ఫొటో‌టాక్సిక్ మొక్కను తాకితే.. చర్మం కాలిపోతుంది. ఏడేళ్ల వరకు ఆ బొబ్బలు తగ్గుముఖం పట్టవని చెప్పారు. తమ గార్డెన్ ను సందర్శించినవారికి ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైన మొక్కలున్నాయో అవగాహన కలుగుతుందని చెప్పారు.

Also Read:  ఉగ్రదాడిలో మరణించిన ప్రవీణ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచిన మంచు ఫ్యామిలీ..