AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgin Galactic: చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.. నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక VSS యూనిటీ-22..

రోదసిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు తెలుగు అమ్మాయి బండ్ల శిరీష్‌. కొద్దిగా ఆలస్యమైనప్పటికి వ్యోమనౌక VSS యూనిటీ-22 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు..

Virgin Galactic: చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.. నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక VSS యూనిటీ-22..
Virgin Galactic
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2021 | 9:13 PM

Share

రోదసి లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు తెలుగు అమ్మాయి బండ్ల శిరీష ‌. కొద్దిగా ఆలస్యమైనప్పటికి వ్యోమనౌక VSS యూనిటీ-22 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ , మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్‌తో కలిసి శిరీష స్పేస్‌ జర్నీ చేస్తున్నారు. మానవ సహిత వ్యోమనౌక VSS-యూనిటీ-22ను VMS-ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తోంది. 90 నిముషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది. సామాన్యులను రోదసీ లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ ప్రకటించారు.

34 ఏళ్ల బండ్డ శిరీష తెలుగు వాళ్లందరికి గర్వకారణంగా నిలిచారు. తొలిసారి అంతరిక్షం లోకి మానవులను తీసుకెళ్లిన ప్రయోగంగా యూనిటీ -22 రికార్డు సృష్టించింది. భారత్‌ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు.

90 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక ప్రయాణం చేసింది. భూ వాతావరణానికి , అంతరిక్షానికి బోర్డర్‌గా భావించే కర్మాన్‌ రేఖను దాటి ప్రయాణం చేసింది. ఇలా స్పేస్‌ జర్నీ చేసిన వాళ్లనే వ్యోమగాములుగా పరిగణిస్తారు. కొద్దిసేపు వాళ్లు భారరహిత స్థితికి చేరుకుంటారు.

గుంటూరుకు చెందిన బండ్ల శిరీష‌ కొన్నాళ్లుగా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, రీసెర్చ్ ఆప‌రేష‌న్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా ప‌ని విధులు నిర్వహిస్తున్నారు. శిరీష 2015లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల మేనేజ‌ర్‌గా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు.

ఈ మ‌ధ్యే 747 ప్లేన్ ఉప‌యోగించి అంత‌రిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్ట‌న్ ఆప‌రేష‌న్స్‌ను కూడా చూసుకుంటోంది. ప‌ర్‌డ్యూ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్, జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి: Anti-Terrorist Squad: యూపీలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు.. ఆపరేషన్ మొదలు పెట్టిన ATS దళాలు

L.Ramana – TRS: కారెక్కేందుకు అంతా రెడీ.. సోమవారం మంత్రి KTR చేతుల మీదుగా TRS సభ్యత్వం తీసుకోనున్న L. రమణ

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..