Anti-Terrorist Squad: యూపీలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు.. ఆపరేషన్ మొదలు పెట్టిన ATS దళాలు
Terror Suspects: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానిక కకోరి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో .. ఓ ఇంటిని ATS (Anti-Terror Squad) కమాండర్లు చుట్టుముట్టారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానిక కకోరి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో.. కాకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిని ATS (Anti-Terror Squad) కమాండర్లు చుట్టుముట్టారు. అనుమానిత ఉగ్రవాదులను ఇద్దరిని ATS అదుపులోకి తీసుకుంది. ఇద్దరూ కూడా అల్ ఖైదాకు చెందిన ఉగ్రవాదులుగా అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. లక్నోలోని కకోరి ప్రాంతంలో ఇద్దరినీ అరెస్టు చేయగా.. వారి నుంచి ప్రెజర్ కుక్కర్ బాంబులు, ఇతర ఆయుధాలు, మరికొంత ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది.
ఈ ఇద్దరు టెర్రరిస్టులు భారీ స్కెచ్ వేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంట్లో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాని పూర్తిగా అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ కమాండర్లు.. సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. నిఘా అధికారులకు అందిన సమాచారంతో దాడిలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ATS కకోరి ప్రాంతంపై కమాండోలతో కలిసి భారీగా పోలీసుల చుట్టుముట్టారు. మరికొందరు అదే ఇంటిలో దాక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అరెస్టు చేసిన ఇద్దరిపై విచారణ జరుగుతోంది.
అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరి పేరు షాహిద్. అతను మాలిహాబాద్ నివాసి అని పోలీసులు గుర్తించారు. దాడి చేసిన ఇల్లు షాహిద్‌దే కావడం. అక్కడే అతను తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మోటారు గ్యారేజీలో పనిచేసేవాడని చెబుతున్నారు. షాహిద్ ఇంట్లో టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు..? ఎంత కాలంగా వారు అక్కడ ఉంటున్నారు..? వారి ప్లాన్ ఎంటి అనే కోణంలో విచారణ మొదలు పెట్టారు.