AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసు 45.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఐదుగురు కుమార్తెలూ ఉన్నారు. తాజాగా 21 ఏళ్ల ఓ యువకుడిని..

ఆమెకు 45 సంవత్సరాలు. ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తాజాగా 21 ఏళ్ల యువకుడితో  సహజీవనం చేస్తోంది.

వయసు 45.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఐదుగురు కుమార్తెలూ ఉన్నారు. తాజాగా 21 ఏళ్ల ఓ యువకుడిని..
Women 4th Marriage
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2021 | 5:49 PM

Share

ఆమెకు 45 సంవత్సరాలు. ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తాజాగా 21 ఏళ్ల యువకుడితో  సహజీవనం చేస్తోంది. అతడిని నాలుగులో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. మధ్యప్రదేశ్​ భిండ్​ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు ఆ మహిళకు ఫస్ట్ టైమ్ పెళ్లి అయ్యింది. రెండేళ్ల తర్వాత అభిప్రాయ బేదాలు రావడంతో భర్తతో విడాకులు తీసుకుంది. యూపీకి చెందిన వినోద్​ అనే వ్యక్తితో ఆ మహిళకు రెండోసారి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. అయితే కొన్నేళ్ల తర్వాత వినోద్​ ఓ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. భర్త చనిపోవడం, పిల్లల భారం ఏం చెయ్యాలో తెలియక ఆమె పుట్టింటికి వెళ్లింది.  అక్కడ బ్రిజేష్​ అనే ఓ యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినకుండా అతడిని పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్ల తర్వాత అతడూ అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు. అ తర్వాత భిండ్​కు చేరుకుంది. అక్కడే నివసించింది. తన ఐదుగురు కుమార్తెల్లో ఒకరికి పెళ్లి చేసింది.

భిండ్​ జిల్లాలోని ఝాన్సీ మొహల్లా ప్రాంతంలో నివసిస్తున్న సదరు మహిళ.. మిథున్​ అనే 21 ఏళ్ల యువకుడితో మళ్లీ ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారు సహజీవనం కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై ఆమె కుమార్తెలు మొదటి నుంచి ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ క్రమంలో రెండో కుమార్తెను ఇంటి నుంచి ఏడాది క్రితం గెంటేసింది. ఇప్పుడు ఆ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. ముగ్గురు కుమార్తెలు కూడా ఈ పెళ్లికి అడ్డుచెప్పగా.. వారిని కూడా ఆమె తన ఇంటి నుంచి బయటకు పంపించేసింది.

చాలారోజుల నుంచి తాను ఆ మహిళతో సహజీవనం చేస్తున్నానని ఆమె ప్రియుడు మిథున్​ తెలిపాడు. అయితే సొసైటీ మాటలు పడలేక తామిద్దరం ఇప్పుడు వివాహం చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఓ కిరాణ షాపులో పని చేయటం ద్వారా​ తనకు వచ్చే రూ.6,000 వేల జీతంతో ఆమె కుమార్తెలను కూడా తాను పోషిస్తున్నానని వివరించాడు.  పోలీస్​ స్టేషన్​కు ఈ పెళ్లి విషయం చేరుకోగా.. ఈ వివాహంతో ఎదురయ్యే అనర్థాల గురించి మిథున్​కు పోలీసులు పూసగుచ్చినట్లు వివరించారు. దాంతో అతడు నిర్ణయం మార్చుకుని..ఆ మహిళను పెళ్లి చేసుకోనని చెప్పాడు. కానీ, ఆ మహిళ మాత్రం తాను ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది.

ఈ పెళ్లి వ్యవహారంలో మహిళతో పాటు, యువకుడికీ డీఎస్పీ పూనమ్​ థాపా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకు వీరి సమస్యకు మాత్రం ఏ పరిష్కారం దొరకలేదు. కానీ ఆ మహిళ కారణంగా నలుగురు ఆడపిల్లల పరిస్థితి అయోమయంగా మారింది.

Also Read: ఢిల్లీలో కోమటిరెడ్డి మకాం.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. తాజాగా కిషన్ రెడ్డిని కలిసి ఏం చర్చించారంటే

నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..