AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikakulam: శ్రీకాకుళంలో సండే కర్ఫ్యూ.. అన్నీ బంద్.. వైన్ షాపులు తప్ప.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న స్థానికులు

శ్రీకాకుళంలో సండే కర్ఫ్యూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సకలం బంద్‌ అంటూనే వైన్‌ షాపులకు పర్మిషన్ ఇవ్వడంపై స్థానికులు...

Srikakulam:  శ్రీకాకుళంలో సండే కర్ఫ్యూ.. అన్నీ బంద్.. వైన్ షాపులు తప్ప.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న స్థానికులు
wine-shops
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2021 | 1:24 PM

Share

శ్రీకాకుళంలో సండే కర్ఫ్యూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సకలం బంద్‌ అంటూనే వైన్‌ షాపులకు పర్మిషన్ ఇవ్వడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనాలు యథేచ్ఛగా రోడ్లపైకి వస్తుంటే అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం 15గంటల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కానీ ఆ ఆదేశాలు ఎవరూ ఖాతరు చేయడం లేదు. జనాలు రోజులాగే రోడ్ల మీదకు వస్తున్నారు. చికెన్, మటన్ షాపులతో పాటు ఇతర దుకాణాలన్నీ క్లోజ్ అయ్యాయి. కానీ వైన్ షాపులు మాత్రం తెరిచారు. చాలామంది అక్కడ క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేశారు. ఇంత జరుగుతున్నా ఎవరూ ఇటువైపు రాలేదు.

కొంతమంది మందుసీసాలను గుట్టుగా తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. సండే సంపూర్ణ లాక్‌డౌన్‌ అని వైన్‌షాపులకు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. అధికారుల తీరుతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొందరికి పర్మిషన్ ఇచ్చి మరికొందర్ని ఇంటికే పరిమితం చేయడం సరికాదన్నది లోకల్స్ వాదన. ఇప్పటికైనా కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read:సొంత మనవరాలినే కిడ్నాప్ చేసిన అమ్మమ్మ, ఎందుకో తెలిస్తే షాకే..

అమ్మో కిలాడీ లేడీలు.. ఖరీదైన వస్త్రాలు ధరించి క్లాస్‌గా కారులో వస్తారు.. ఆపై ఎర్ర బస్సు ఎక్కి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్