Warangal News: అమ్మో కిలాడీ లేడీలు.. ఖరీదైన వస్త్రాలు ధరించి క్లాస్‌గా కారులో వస్తారు.. ఆపై ఎర్ర బస్సు ఎక్కి..

Warangal News: అమ్మో ఈ కీలాడీ లేడీలు మాములు దొంగలు కాదు.. పైకి క్లాసుగా కనిపిస్తారు.. ఖరీదైన వస్త్రాలు ధరించి కారులో వస్తారు..

Warangal News: అమ్మో కిలాడీ లేడీలు.. ఖరీదైన వస్త్రాలు ధరించి క్లాస్‌గా కారులో వస్తారు.. ఆపై ఎర్ర బస్సు ఎక్కి..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 11, 2021 | 12:22 PM

Warangal News: అమ్మో ఈ కీలాడీ లేడీలు మాములు దొంగలు కాదు.. పైకి క్లాసుగా కనిపిస్తారు.. ఖరీదైన వస్త్రాలు ధరించి కారులో వస్తారు.. ఆఖరికి ఎర్ర బస్సు ఎక్కి దొరికినకాడికి దోచేస్తారు. జనాలు ఏమాత్రం ఏమరపాటుగా వున్నా ఒంటిపై ఉన్న బంగారం మూడో కంటికి తెలియకుండా మాయం చేస్తారు. ఆర్టీసీ బస్సులను అడ్డాగా ఎంచుకొని దర్జాగా దోపిడీలకు పాల్పడుతున్న ఓ ఇద్దరు కీలాడీ లేడీలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు అర కిలో బంగారం, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.

కొద్దిరోజుల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లింగాలఘనపూర్ వద్ద ఈ ఇద్దరు కీలాడీ లేడీలు అడ్డంగా బుక్కయ్యారు. ఆర్టీసీ బస్సులో ఓ యువతి మెడలో బంగారు గొలుసు దొంగిలించిన క్రమంలో సహప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీరిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెల్లడయ్యాయి. వీరి నుండి 24 లక్షల రూపాయల విలువైన 473 గ్రాముల బంగారు అభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వీరు దొంగతనాలకు పాల్పడిన అనంతరం తప్పించుకునేందుకు వినియోగించే ఒక కారును కూడా పోలీసులు సీజ్ చేశారు.

పోలీసులు అరెస్టుచేసిన ఈ ఇద్దరు కీలాడీలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అలియాస్ దివ్యా ఆలియాస్ రాణి, బోయ కవిత గా గుర్తించారు. వీరు హైదరాబాద్‌‌లోని ఎల్.బి నగర్ లో నివాసం ఉంటూ ఇలా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నిందితురాళ్ళు ఇద్దరు టైలరింగ్ వృత్తి చేసేవారు. ఆ ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించి జల్సాగా జీవించాలనే అలోచనతో ఇలాంటి దొంగతనాలకు స్కెచ్ వేశారు. రద్దీగా వుండే బస్సులు, ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు అభరణాల చోరీలకు పాల్పడినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ తెలిపారు.

ఈ మహిళలు ఇద్దరూ 2005 నుండి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ లోని పటాన్ చెరువు, రాంగోపాల్‌పేట్, మేడిపల్లి, ఎల్.బినగర్, నల్గొండ పట్టణం, నల్గొండ గ్రామీణ, గుర్రంపోడు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో 8 చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత 2014 సంవత్సరం నుండి 2019 వరకు మొత్తం 16 చోరీలకు పాల్పడ్డారు. ఇందులో భువనగిరి ప్రాంతంలో 5 చోరీలకు పాల్పడగా, బీబీనగర్, దేవరకొండ ప్రాంతాల్లో మూడు చోప్పున మొత్తం ఆరు దోపిడీలకు పాల్పడ్డారు. ఇక ఆలేరు, రాంచంద్రపురం, యాదగిరిగుట్ట, చింతపల్లి, ఎల్.బినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున 5 చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిని ఎవరు గుర్తుపట్టని విధంగా శ్రీమంతులుగా బిల్డప్ ఇస్తూ ఖరీదైన చీరలను ధరించి వారి వేషధారణ మారుస్తూ చోరీలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, ఏడాది వ్యవధిలో మొత్తం 11 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో వరంగల్ పోలీస్ కమినరేట్ పరిధిలోని హన్మకొండ, మట్వాడా, నర్సంపేట్ లలో రెండు చొప్పున చోరీలకు పాల్పడగా, ఇంతేజా గంజ్, జనగాం, బచ్చన్నపేట్, లింగాలఘణపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీకి పాల్పడ్డారు. తాజాగా లింగాలఘనపూర్ ప్రాంతంలోనూ ఇలాగే చోరీకి యత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు లేడి కిలాడీలను అరెస్టు చేసిన పోలీసులు భారీ మొత్తంలో బంగారు స్వాధీనం చేసుకొని కటకటాల్లోకి పంపారు.

Also read:

కిమ్ తో జింగ్ భాయీ..భాయీ..విదేశీ శక్తులు ఒక్కటవుతున్న వేళ..మేమిద్దరం..ఎవరికీ బెదరం

తాలిబన్ల జోరు..ఆఫ్ఘనిస్తాన్ నుంచి 50 మంది అధికారులను ఖాళీ చేయించిన ప్రభుత్వం

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..