తాలిబన్ల జోరు..ఆఫ్ఘనిస్తాన్ నుంచి 50 మంది అధికారులను ఖాళీ చేయించిన ప్రభుత్వం
తాలిబన్ల జోరుతో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కాందహార్ దౌత్య కార్యాలయం (కాన్సులేట్) లో 50 మంది అధికారులను, ఇతర స్టాఫ్ సభ్యులను, సిబ్బందిని ఇండియా ఖాళీ చేయించింది. ఆఫ్ఘన్ లో తాలిబన్లు క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకుంటున్నారు.
తాలిబన్ల జోరుతో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కాందహార్ దౌత్య కార్యాలయం (కాన్సులేట్) లో 50 మంది అధికారులను, ఇతర స్టాఫ్ సభ్యులను, సిబ్బందిని ఇండియా ఖాళీ చేయించింది. ఆఫ్ఘన్ లో తాలిబన్లు క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకుంటున్నారు. అక్కడి పరిస్థితి రోజురోజుకీ డేంజరస్ గా మారుతోందని, భారతీయులకు రక్షణ, భద్రతలపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది. మన స్పందనను ఆలోచించి తెలియజేస్తామని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి గత మంగళవారం చెప్పినప్పటికీ..తాజా పరిణామాలు మాత్రం ప్రమాదకరంగానే ఉన్నాయని వార్తలు అందుతున్నాయి. అమెరికా ఆఫ్ఘన్ నుంచి తన సైనిక బలగాలను క్రమంగా ఉపసంహరిస్తున్న కొద్దీ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వచ్చే ఆగస్టు మాసాంతానికి ఈ దేశం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అప్పటికి తాలిబన్లు మరింతగా ముందుకు చొచ్చుకు వచ్చి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చునని భయపడుతున్నారు. గత కొన్ని వారాలుగా పలు గ్రామీణ జిల్లాలు వారి వశమయ్యాయి.
కాబూల్ లోని ఇండియన్ ఎంబసీని, కాందహార్, మజారే షరీఫ్ లలో దౌత్య కార్యాలయాలను మూసివేసే యోచన లేదని భారత ప్రభుత్వం చెప్పినప్పటికీ .. తాజా పరిస్థితుల గురించి ఇండియాలోని ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ కి వివరించారు. తాలిబన్ల లోని టెర్రర్ గ్రూపులు సామాన్య ప్రజలను సైతం టార్గెట్లు చేస్తున్నాయని, కిడ్నాప్ వంటి ఘటనలకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది. ఈ గ్రూపులతో ఆఫ్ఘన్ భద్రతాదళాల్లో కొన్ని వర్గాలు కూడా చేతులు కలుపుతున్నట్టు వెల్లడవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : దేవుడితోనైనా కొట్లాడతాం..:కేటీఆర్.మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
భారత్ లో మల్లి మొదలైన డెల్టా వేరియంట్ టెన్షన్ లైవ్ వీడియో..:Delta Variant Live Video.