కిమ్ తో జింగ్ భాయీ..భాయీ..విదేశీ శక్తులు ఒక్కటవుతున్న వేళ..మేమిద్దరం..ఎవరికీ బెదరం
ఉత్తర కొరియా, చైనా దేశాలు రెండూ ఒకదానికొకటి స్నేహ హస్తాన్ని చాటుకుంటున్నాయి. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధినేత జీజిన్ పింగ్..ఇద్దరూ ఒక్కటవుతున్నారు. జిన్ పింగ్ కి రాసిన లేఖలో కిమ్...విద్వేషకర విదేశీ శక్తులు బలపడుతున్న ఈ తరుణంలో మన సంబంధాలు మరింత
ఉత్తర కొరియా, చైనా దేశాలు రెండూ ఒకదానికొకటి స్నేహ హస్తాన్ని చాటుకుంటున్నాయి. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధినేత జీజిన్ పింగ్..ఇద్దరూ ఒక్కటవుతున్నారు. జిన్ పింగ్ కి రాసిన లేఖలో కిమ్…విద్వేషకర విదేశీ శక్తులు బలపడుతున్న ఈ తరుణంలో మన సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరారు. ఉభయ దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన దేశాల మధ్య స్నేహం, పరస్పర సహకారం ఇప్పుడు ఎంతయినా అవసరమన్నారు. ఈ లేఖకు జిన్ పింగ్ కూడా స్పందిస్తూ…వీటిని నూతన దశకు తీసుకువెళదామని, ఇది నా ప్రామిస్ కూడా అని పేర్కొన్నారట. 1961 లో ఉత్తరకొరియా, చైనా దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. నార్త్ కొరియాకు సహకారం అందిస్తున్న ఒకేఒక దేశం చైనా..
తన అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను అదే పనిగా ప్రయోగిస్తున్న నార్త్ కొరియాపై ఇతర దేశాలు భగ్గుమంటున్నాయి. వీటిని నిలిపివేయాలని ఐరాస కూడా కోరింది. కానీ కిమ్ అంగీకరించలేదు. దీంతో పలు దేశాలు నార్త్ కొరియాపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఈ దేశంలో ఆహార కొరత ఏర్పడింది. ఆర్ధిక వ్యవస్థ కూడా క్షీణిస్తూ వచ్చింది. పైగా కరోనా సంక్షోభం కూడా దీనికి తోడయింది. ఈ నేపథ్యంలో తన వాణిజ్య సంబంధాలకు, ఇతరత్రా అవసరాలకోసం ఉత్తర కొరియా చైనాపై ఆధారపడ తప్పలేదు. ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ పరిస్థితి జటిలంగా మారుతున్న వేళ..మునుపటికన్నా ఎక్కువగా మనం సహకరించుకోవాలని కిమ్..చైనాను కోరారు. ఇందుకు జీ జిన్ పింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. .
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : దేవుడితోనైనా కొట్లాడతాం..:కేటీఆర్.మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
భారత్ లో మల్లి మొదలైన డెల్టా వేరియంట్ టెన్షన్ లైవ్ వీడియో..:Delta Variant Live Video.