AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ ఆరోగ్యాన్ని హైట్ డిసైడ్ చేస్తుందని మీకు తెలుసా..?

Health Tips: మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం వస్తుందని మనందరికీ తెలుసు. అయితే, మంచి ఆహారం తీసుకుంటే మన ఎత్తు కూడా పెరుగుతుందంట. మీ వ్యక్తిత్వాన్ని పెంచేందుకు సరైన ఎత్తు కూడా పనిచేస్తుందంట.

Health Tips: మీ ఆరోగ్యాన్ని హైట్ డిసైడ్ చేస్తుందని మీకు తెలుసా..?
Height
Venkata Chari
|

Updated on: Jul 11, 2021 | 6:04 PM

Share

Health Tips: మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం వస్తుందని మనందరికీ తెలుసు. అయితే, మంచి ఆహారం తీసుకుంటే మన ఎత్తు కూడా పెరుగుతుందని మీకు తెలుసా? మీ వ్యక్తిత్వాన్ని పెంచేందుకు సరైన ఎత్తు కూడా పనిచేస్తుందంట. అయితే, హైట్ అనేది ఆరోగ్యానికి సంబంధించినది అని చాలా మందికి తెలియదు. హైట్‌తో ఆరోగ్యానికి ఉన్న సంబంధాలను వివరరంగా చూద్దాం. 1. తక్కువ ఎత్తుతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం: ఓ పరిశోధన ప్రకారం, తక్కువ ఎత్తులో ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని తేలింది. అలాగే ఎక్కువ ఎత్తులో ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు హైట్ తక్కువ ఉన్న వారితో పోల్చితే కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుందంట. 2. పొడవైన వ్యక్తులకు డయాబెటిస్: జర్మన్ సెంటర్ ఆఫ్ డయాబెటిక్ రీసెర్చ్ ప్రకారం, పొడవైన వ్యక్తులలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందంట. తక్కువ ఎత్తుగల వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. 3. తక్కువ ఎత్తు గల మహిళలకు ప్రీ టర్మ్ బర్త్: హైట్ ఎక్కువగా ఉన్న మహిళలతో పోల్చితే.. తక్కువ ఎత్తు గల మహిళలు ప్రీ టర్మ్ డెలివరీలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. పొడవైన మహిళల్లో ప్రీ మెచ్యూర్ డెలివరీలకు చాలా తక్కువ అవకాశం ఉందంట. 4. జుట్టు రాలడం: ఎత్తు తక్కువ గల పురుషుల జుట్టు వేగంగా ఊడిపోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎత్తుగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. ఎత్తు తక్కువ గల వారిలో ప్రాణాంతక వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉందంట. ఎత్తు తక్కువ ఉన్న వారిలో రక్షిత జన్యువులు అధికంగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. అయితే వీరిలో రక్షిత జన్యువలు ఎక్కువ కాలం జీవిస్తామని తేలిందంట. 5. ఐక్యూ: ఐక్యూని హైట్ ప్రభావితం చేస్తుందని ఎడిన్‌బర్గ్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ది స్కాట్ మాన్ నివేదిక మేరకు.. ఎత్తు తక్కువ గల వ్యక్తుల కంటే ఎక్కువ హైట్ గల వారిలో ఐక్యూ స్థాయి ఎక్కువగా ఉంటుందంట. 6. నిరాశ: సగటు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తుగల వారు నిరాశకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. అలాగే తక్కువ ఎత్తు ఉన్నవారిలో నిరాశ లేదా ఒత్తిడిని తగ్గించేందుకు అధిక జన్యువులను కలిగి ఉంటారని తేలింది.

Also Read:

Stress Relief: నిత్యం ఒత్తిడితో సతమతమవుతున్నారా..? అయితే ఈ పద్దతులు పాటించండి..

Fear: భయం అంటే ఏమిటి..? మీలో ఉండే భయం సహజమైనదా..? లేక అపోహనా.?.. దానిని తొలగించుకోండిలా..!

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా