Fear: భయం అంటే ఏమిటి..? మీలో ఉండే భయం సహజమైనదా..? లేక అపోహనా.?.. దానిని తొలగించుకోండిలా..!
Fear: భయం.. భయం.. ఇది చాలా మందిలో ఉంటుంది. నలుగురు ముందు మాట్లాడాలన్నా.. విమాన ప్రయాణం చేయాలన్న భయమే. అలాగే కొంత మందిలో పరీక్షలంటే భయం..
Fear: భయం.. భయం.. ఇది చాలా మందిలో ఉంటుంది. నలుగురు ముందు మాట్లాడాలన్నా.. విమాన ప్రయాణం చేయాలన్న భయమే. అలాగే కొంత మందిలో పరీక్షలంటే భయం ఉంటుంది. కొంత మందికి బొద్దింకలు, బల్లి అంటే చాలా భయం ఉంటుంది. వాటిని చూస్తేనే వణికిపోతుంటారు. కొందరు నీడను చూస్తుంటే కూడా భయపడిపోతుంటారు. మరి కొందరు చీకటిని చూసినా, నిద్రిపోయే సమయంలో కూడా భయపడుతుంటారు. ఇలా చాలా మంది రకరకాలుగా భయం అనేది ఉంటుంది. ఇలా రకరకాలుగా భయాందోళన చెందడం వల్ల అనారోగ్యం బారిన పడే అకాశాలున్నాయి. భయంతో వణికిపోతూ జ్వరం బారిన పడుతుంటాము. దీంతో పాటు రకరకాల వ్యాధులు దరి చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆ భయం వారి విజయం వైపు అడుగు వెయ్యనీయకుండా అడ్డుకుంటుంది. వారిలో భయం ఉండటం వల్ల జీవితం ముందుకు సాగదు. వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతుంటారు. వారి కోరికలను తీర్చుకోలేక పోవటానికి, వారి కలలను నిర్వీర్యం చేసుకోడానికి ముఖ్య కారణం ఈ భయం. మరి ఈ భయాన్ని ఎలా జయించాలో తెలిస్తే మాత్రం, మనం ఎన్నో విషయాలలో గొప్ప విజయాలు సాదించవచ్చు అని ఎన్నో పరిశోధకులు చెబుతున్నారు. మీకు ఎలాంటి సమయంలో ఎక్కువగా భయం వేస్తుందనేదానిని గుర్తించడం చాలా ముఖ్యం. కొంత మందికి కొన్ని సమయాల్లో ఎక్కువగా భయం ఉండవచ్చు. అలాగే కొద్దిమంది ఒక రకమైన వ్యక్తులను కలిసినప్పుడు లేదా వారితో మాట్లాడుతున్నప్పుడు భయపడుతుంటారు. ముందు ఎక్కువగా దేనికి భయపడుతుంటారో చెక్ చేసుకోవాలి. పరిశోధకులు తెలిపినదాని ప్రకారం.. మరి భయాన్ని ఎలా జయించాలో చూద్దాం.
భయం సహజమైనదా లేక అపోహన:
భయం అనేది సహజమైనదా లేక అపోహన అనేది గుర్తించాలి. కొన్ని భయాలు సహజమైనవి ఉంటాయి. కానీ కొన్ని భయాలు మన అపోహలు మాత్రమే అయి ఉంటుంది.
ఎత్తుపై నుంచి కిందకు చూస్తే కలిగే భయం:
చాలా మందికి ఎత్తుపై నుంచి కిందకు చూస్తే భయపడిపోతుంటారు. అలాంటి భయం సహజమైనదే. ఎందుకంటే మనిషికి పుట్టుకతోనే ఎత్తు ప్రదేశాలన్న లేదా పెద్ద శబ్దాలన్న సహజంగానే భయపడుతుంటాడు. కానీ కొద్ది మందికి జీవితంలో చిన్న చిన్న విషయాలు, లిఫ్ట్‌లో వెళ్లాలన్న భయపడుతుంటారు. బల్లిని చూసిన భయపడుతుంటారు. ఇవన్నీ కూడా అపోహాలు మాత్రమేనని చెప్పవచ్చు.
దీర్ఘ శ్వాస తీసుకోండి:
భయం అనేది మన మనస్సులోకి రాగానే మనకు చమటలు పట్టేస్తుంటాయి. కాళ్లు, చేతులు, గుండెలో దడ అనిపిస్తుంటుంది. ఒళ్లంత తిమ్మిరిలు వచ్చినట్లుగా ఏదోలా ఉంటుంది. కాళ్లు, చేతులు వణికినట్లుగా అయిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆ భయం ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఆందోళనని తగ్గించుకోవాలి అంటే మాత్రం, మన చేతిలో ఉన్నా మంచి చిట్కా.. మన శ్వాస అని గుర్తించాలి. ఇప్పటి నుండి మీరు ఎప్పుడు కొంత భయానికి గురి అయిన కూడా వెంబడే ఏడూ సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎప్పుడైతే మీరు శ్వాస తీసుకోవడం మొదలు పెడతారో మీ ఆందోళన తగ్గి, కొంత ప్రశాంతత పొందుతారు.
అప్రమత్తతో ఎదుర్కొనండి:
భయాన్ని ఎదుర్కొవడం వల్లనే మనం భయాన్ని తగ్గించుకోగలం. అంటే ఏ పని చేయడానికి మనకు భయం అవుతుందో ఆ పని చేయడం చాలా అవసరం. కానీ మీకు అనుమానం రావచ్చు ఆ పని చేయ్యలంటేనే భయం అయినప్పడు ఎలా దానిని చెయ్యగలము అని. సో ఈ విషయంలో ఆ పని చెయ్యడానికి మన సంసిద్దతత చాలా ముఖ్యం. ఉదాహరణకి మీకు నీళ్ళు అంటే భయం అనుకుందాం. మీరు ఆ నీటి భయం పోగుట్టుకోడానికి ముందుగా ఒక స్విమ్మింగ్ పూల్ లో ఒక కోచ్ సహాయం తీసుకొని, వారి పర్యవేక్షణలో నీటిలోకి దిగాలి. ఇప్పుడు మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా కోచ్ ఉన్నారు కాబట్టి ఎలాంటి భయం ఉండదు. మెల్లిగా మీరు స్విమ్మింగ్ కూడా నేరుచుకోగలరు.
పాజిటివ్‌గా ఉహించడం మొదలెట్టండి:
భయం ఉన్న వారు ఏ విషయంలోనైతే భయపడుతున్నారో ఆ విషయంలో విజేతగా నిలుస్తున్నట్లు, ఆ భయాన్ని గెలిచి ధైర్యంగా ఆ పని చేస్తున్నట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వలన త్వరగా మీ భయాన్ని జయించగల్గుతారు. ఎందుకంటే చాలా సందర్బాలలో మన భయాలు కూడా మన ఉహల నుండే పుడుతాయి. అందుకే ఎప్పుడైతే మనం ఒక విషయాన్నీ పాజిటివ్ గా ఉహిస్తున్నమో అప్పుడు భయపడే అవకాశమే ఉండదు.