Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..
Weather Alert: ఐఎండీ సూచనల ప్రకారం.. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల..
Weather Alert: ఐఎండీ సూచనల ప్రకారం.. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇరోజు, రేపు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. అలాగే రాయలసీమలోనూ ఇదేరకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు ఎవరూ మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.
ఇదిలాఉండగా.. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రభావంతో తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.
Also read:
Telangana News: సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు….