Hyderabad: అభిప్రాయ భేదాలతో 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.. మళ్లీ ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారు

పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఓ కపుల్ కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నారు. విడిపోయిన ఆ జంట.. 15 ఏళ్ల తర్వాత....

Hyderabad: అభిప్రాయ భేదాలతో 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.. మళ్లీ ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారు
Couple Reunite After 15 Years
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 11, 2021 | 12:21 PM

పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఓ కపుల్ కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నారు. విడిపోయిన ఆ జంట.. 15 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ ఒక్కటవుతున్నారు. ఈ అరుదైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. అందునా విదేశాల్లో సెటిల్ అయ్యారు. వారు ఇక్కడికి వచ్చేది కూడా ఏడాదికి ఒకసారో, రెండు సార్లో. దీంతో వారిద్దరినీ ఒంటరితనం వెంటాడింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మాట్లాడుకోని.. మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా బతకలేక తిరిగి దాంపత్య జీవితం మొదలెట్టాలనుకున్న వారి అభ్యర్థనపై ఫ్యామిలీ కోర్టు సానుకూలంగా స్పందించింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ జంట (భర్త వయసు 70 ఏళ్లు) వివాహం తర్వాత 20 ఏళ్లపాటు కాపురం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఈ క్రమంలో కుటుంబంలో అగ్గి రాజుకుంది. అభిప్రాయ భేదాలు తారాస్థాయికి వెళ్లాయి. కలిసుండలేమని డిసైడయ్యారు. ఎవరి బతుకు వారు బతుకుదామనే నిర్ణయానికి వచ్చి… కోర్టులో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 15 ఏళ్లు ఎవరి జీవితం వారు గడిపారు.. పిల్లలు ఫారెన్ కంట్రీస్‌లో స్ఠిరపడ్డారు. ఒంటరిగా మిగిలిపోయిన ఈ భార్యాభర్తలు ఓ వైపు వయోభారం, మరోవైపు వేధిస్తున్న ఒంటరితనంతో అల్లాడిపోయారు. దీంతో విడిపోయిన మాజీ భార్యభర్తలు తిరిగి దాంపత్య జీవితం మొదలెట్టాలని ఫిక్సయ్యారు. విడాకులు తీసుకున్న కోర్టుకే వెళ్లి.. తిరిగి ఒక్కటవుతామని చెప్పారు. వారి సమస్యపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఈ విషయాన్ని లోక్‌అదాలత్‌కు పంపింది. దీనిపై శనివారం లోక్ అదాలత్‌లో విచారణ జరిగింది. హిందూ వివాహ చట్టం, సెక్షన్‌ 15 ప్రకారం డైవర్స్ తీసుకున్న దంపతులు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి లోక్‌అదాలత్‌ బెంచ్‌ శనివారం పర్మిషన్ ఇచ్చింది. దీంతో వచ్చే వారం  మాజీ దంపతులు మళ్లీ దాంపత్య జీవితం కొత్తగా మొదలెట్టబోతున్నారు.

Also Read: సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు….

థర్డ్‌ వేవ్‌తో పాటు దేశాన్ని అదే రేంజ్‌లో బేంబేలెత్తిస్తున్న జికా వైరస్… ఇవి లక్షణాలు