Employee Commits Suicide: బ్యాంకులో ఉద్యోగం.. ఈ నెల 4వ తేదీన నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం..!

Employee Commits Suicide: బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈనెల 4వ తేదీన ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అంతలోనే విషాదకరమైన..

Employee Commits Suicide: బ్యాంకులో ఉద్యోగం.. ఈ నెల 4వ తేదీన నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 11, 2021 | 1:24 PM

Employee Commits Suicide: బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈనెల 4వ తేదీన ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అంతలోనే విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన లక్మానాయక్ కుమారుడు కార్తీక్ ఎంటెక్ చదివాడు. గత కొన్ని నెలలుగా అతడు తమిళనాడు వేలూరు జిల్లాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కార్తీక్‌కు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ సంబంధం కుదిరింది. దీంతో జూలై 4వ తేదీని హైదరాబాద్‌లోనే నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వచ్చే నెలలో కార్తీక్‌ వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయానికి వచ్చాయి.

ఇక నిశ్చితార్థం పూర్తయ్యాక కార్తీక్‌ తిరిగి అరక్కోణం చేరుకున్నాడు. అయితే కార్తీక్ ఉంటున్న గదిలో నుంచి శనివారం దుర్వాసన రావడంతో.. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆ గది తలపులను బద్దలు గొట్టారు. పోలీసులు లోపలికి వెళ్లేసరికి కార్తీక్ మృతదేహం కనిపించింది. కార్తీక్‌ నేలపై విగతజీవిగా పడి ఉన్నాడు. ముందుగా ఉరివేసుకుని ఉంటాడని, ఆ తర్వాత నెలపై పడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కార్తీక్‌ గత కొన్ని రోజులుగా డల్‌గా ఉంటున్నట్లు అతని తోటి ఉద్యోగులు పోలీసులు ముందు తెలిపారు. అయితే కార్తీక్ చనిపోయేముందు రాసిన ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, కార్తీక్ ఓ యువతిని ప్రేమించాడని, ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని తెలుస్తోంది. ప్రేమ పెళ్లికి అంగీకరించని కార్తీక్ తల్లిదండ్రులు.. మరో యువతితో అతని పెళ్లి చేసేందుకు నిర్ణయించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి

జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌లో ఎన్‌ఐఏ దాడులు.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్టు.. ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు స్వాధీనం

వీడికి చిన్నారులు కనిపిస్తే చాలు కాటేస్తాడు.. చిన్నారుల లైంగిక దాడిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు

Dog: పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే