వీడికి చిన్నారులు కనిపిస్తే చాలు కాటేస్తాడు.. చిన్నారుల లైంగిక దాడిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు

మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినా వారిలో ఏ మాత్రం..

వీడికి చిన్నారులు కనిపిస్తే చాలు కాటేస్తాడు.. చిన్నారుల లైంగిక దాడిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 11, 2021 | 9:51 AM

మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినా వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. చిన్నారి బాలికలే లక్ష్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ కామాంధున్ని రాచకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డ్రగ్స్‌కు బానిసలైన చిన్నారుల పట్ల వికృతంగా ప్రవర్తించే 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిరామ్‌దాస్‌ అలియాస్‌ అభి 12 సంవత్సరాల కిందట భార్యతో కలిసి నగరానికి వలస వచ్చాడు. అయితే 8 ఏళ్ల కిందట భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధి బండ్లగూడలోని ఓ గదిలో అద్దెకుంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసగా మారిన అభిరామ్‌దాస్‌ కామవాంఛను తీర్చుకునేందుకు చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీలో ఈ నెల 4న మూడున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. దీంతో గమనించిన మరో బాలిక ఆ చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చిన్నారిని రాత్రంతా సమీప అటవీ ప్రాంతంలోనే ఉంచి అఘాయిత్యానికి పాల్పడి, ఆపై సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.

ఇక రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా, నిందితుడు మరో బాలికను అపహరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. దమ్మాయిగూడ ప్రాంతంలోని కిరాణా దుకాణానికి వచ్చిన నిందితుడు అక్కడే ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా, సదరు బాలిక తల్లి ప్రతిఘటించడంతో పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే కీసర ఠాణా పరిధిలో మరో చిన్నారిపై దాడికి పాల్పడిన ఘటనలో ఈ కామాంధున్ని నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష వేయాలని రాచకొండ కమిషనరేట్‌ ఎదుట బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తికి వినతిపత్రం అందజేశారు.

ఇవీ కూడా చదవండి

Dog: పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

Crime: అమానుషం.. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?