Dog: పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్ అవుతారు..!
పెంపుడు కుక్కలంటే చాలా మందికి ఇష్టమే. చాలా మంది తమ తమ ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను పెరట్లో వదిలిలేస్తుంటారు. ఇంటి గుమ్మం,.
పెంపుడు కుక్కలంటే చాలా మందికి ఇష్టమే. చాలా మంది తమ తమ ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను పెరట్లో వదిలిలేస్తుంటారు. ఇంటి గుమ్మం, పెరట్లో ఉన్న కుక్కలు వచ్చి, పోయే వ్యక్తులను చూసి పెద్దగా గర్జిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులు ఎవరైనా ఇంటి వైపు వస్తున్నప్పుడు బీభత్సంగా అరుస్తుంటాయి. అయితే ఈ కుక్కల అరుపులకు కొందరు భయపడుతుంటారు. అటు వైపు వచ్చేందుకు కూడా ఇష్టపడరు. మరి కొందరు అవి మొరిగిన అవేం పట్టించుకోకుండా దైర్యంగా ముందుకు వెళ్తారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్‌కు గురయ్యారు. పెంపుడు కుక్క రోజు అరుస్తుందని ఓ వ్యక్తి చేసిన పని ఆ గ్రామంలో సంచలనంగా మారింది.
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో సుధాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. తనకు ఎంతో ఇష్టమైన కుక్కను ఇంటి పెరట్లో వదిలిపెట్టారు. గేటుకు అవతలివైపు వెళ్తున్న వ్యక్తులను చూస్తూ తరచూ మొరుగుతూ ఉండేది. అందరూ పెద్దగా పట్టించుకొనే వారు కాదు. కానీ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న జహీర్ అనే వ్యక్తి రోజు అటుగా వెళ్తూ వచ్చేవాడు. ఈ కుక్క మొరగడం వల్ల కోపాన్ని కట్టలు తెంచుకున్న ఆయన.. రెండు మూడు సార్లు యజమాని సుధాకర్ తో గొడవకు దిగాడు. కుక్కను అదుపులో పెట్టుకోకపోతే .. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. కానీ ఆ కుక్క ఆయనను చూసి మొరుగుతుండేది. తనను చూసి చీటికి మాటికి మొరుగుతుందనే కోపంతో దాడి చేసేందుకు కొడవలిని వెంట తెచ్చుకున్నాడు. దీంతో రోజువారీగా మళ్లీ అతన్ని చూసి కుక్క మొరగడంతో జహీర్ సుధాకర్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో జహీర్ వెంట తెచ్చుకున్న కొడవలితో సుధాకర్‌పై దాడికి దిగాడు. ఈ దాడిలో సుధాకర్‌కు తీవ్ర గాయాలై రక్త స్రావం కావడం వెంటనే కుటుంబ సభ్యులు 108లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుధాకర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. జహీర్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.