Kathi Mahesh Death: స్వస్థలానికి కత్తి మహేశ్ మృతదేహం తరలింపు.. నేడు అంత్యక్రియలు..

Kathi Mahesh Funeral today: నటుడు, సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేశ్‌(45) చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. జూన్‌ 27న ఏపీలోని

Kathi Mahesh Death: స్వస్థలానికి కత్తి మహేశ్ మృతదేహం తరలింపు.. నేడు అంత్యక్రియలు..
Katti Mahesh
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 11, 2021 | 7:03 AM

Kathi Mahesh Funerals today: నటుడు, సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేశ్‌(45) చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. జూన్‌ 27న ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తల, కళ్లకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ నిర్వహించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన స్వస్థలానికి తరలించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికోసం బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం నాటికి కత్తి మహేష్ అంత్యక్రియలు పూర్తవుతాయని బంధువులు వెల్లడించారు.

కాగా.. సినీ విమర్శకుడికి ఎక్కువగా పేరు సంపాదించుకున్న మహేష్.. కోల్‌కతాకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త సోనాలికను వివాహమాడారు. ఓ కుమారుడు ఉన్నాడు. కత్తి మహేష్, భార్య సొనాలి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో వారు కొంతకాలం క్రితం స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆమె భోపాల్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. విడిపోయినప్పటికీ.. మహేష్‌కు.. భార్య సొనాలితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. బంధువులు పేర్కొన్నారు.

Also Read:

Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..

Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మిణుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..