Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..
Kathi Mahesh : రోడ్డు ప్రమాదంలో సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతిచెందిన సంగతి తెలిసిందే. గత నెల 26 న నెల్లూరు
Kathi Mahesh : రోడ్డు ప్రమాదంలో సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతిచెందిన సంగతి తెలిసిందే. గత నెల 26 న నెల్లూరు జిల్లా లో రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ముందు సీట్లో ఉన్న మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరగగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు.. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కత్తి మహేష్ చికిత్సకై 17 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఏ దురదృష్టం వెంటాడిందో తెలియదు కానీ కత్తి మహేష్ చికిత్స పొందుతూ మరణించాడు.
సినీ విమర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న కత్తి మహేశ్ అకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి మృతి పట్ల స్నేహితులు, అభిమానులు ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్‌లో నటుడు, విమర్శకుడే కాదు మంచి సాహితీ అభిమాని కూడా ఉన్నాడు. పుస్తక సమీక్షలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుండేవాడు. నెల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి ముందు కూడా ఆయన రెండు పుస్తకాల గురించి ఫేస్‌బుక్‌లో ప్రస్తావించాడు. వాటిని చదవాలంటూ నెటిజన్లకు సూచించాడు.
ప్రమాదానికి ముందు ఆర్ట్స్‌పై తనకున్న మక్కువను తెలుపుతూ కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల కంటే కూడా తెలుగును ఎక్కువగా చదివేవాడినంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ‘మా’ ఎన్నికలపైనా తన స్పందన తెలియజేశాడు. ప్రకాశ్ రాజ్ పోటీని వ్యతిరేకిస్తూ నాన్ లోకల్ అంటూ వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. కత్తి మహేశ్ మరణ వార్త తనను షాక్‌కు, ఆవేదనకు గురిచేసిందని హీరో మంచు మనోజ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు.