Wimbledon 2021: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా ఆష్లే బార్టీ.. ఫైనల్‌లో కరోలినా ప్లిస్కోవాపై ఘన విజయం

Wimbledon 2021: వింబుల్డన్‌ 2021లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆష్లే బార్టీ మహిళల సింగిల్స్‌ విభాగంలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Wimbledon 2021: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా ఆష్లే బార్టీ.. ఫైనల్‌లో కరోలినా ప్లిస్కోవాపై ఘన విజయం
Ashleigh Barty 1
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 10, 2021 | 11:07 PM

Wimbledon 2021: వింబుల్డన్‌ 2021లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆష్లే బార్టీ మహిళల సింగిల్స్‌ విభాగంలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ఆమె చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే బార్టీ తన కెరీర్‌లో రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు టైటిల్‌ సాధించింది. తొలిసెట్‌లో అలవోకగా గెలిచిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ రెండో సెట్‌లో కాస్త తడబడిపోయింది. దాంతో ప్లిస్కోవా పైచేయి సాధించి మ్యాచ్‌ను ఉత్కంఠస్థితికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే మూడోసెట్‌ అనివార్యమవ్వగా ఈసారి బార్టీ ఆధిపత్యం చెలాయించింది. చివరికి తన కలను నిజం చేస్తూ టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

41 సంవత్సరాల ఆస్ట్రేలియా నిరీక్షణ ముగిసింది.. మూడో సెట్‌లో ప్రారంభంలోనే ప్లిస్కోవా సర్వ్‌ను బద్దలు కొట్టడం ద్వారా బార్టీ ముందంజ వేసింది. తర్వాత ఆమెకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నిర్ణయాత్మక సెట్‌ను 6–3తో గెలుచుకోవడం ద్వారా బార్టీ మొదటిసారి వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆమెకంటే ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఇవాన్ గూలాగోంగ్ కోలి 1980 లో టైటిల్ సాధించింది. కోలి ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలిచింది. దీంతో మహిళల సింగిల్స్‌లో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది. బార్టీ, కొల్లీ కాకుండా గొప్ప ఆటగాడు మార్గరెట్ కోర్ట్ ఈ టైటిల్‌ను 3 సార్లు సాధించింది.

వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే ప్రయాణంలో బార్టీ చాలా కష్టపడిందని చెప్పవచ్చు. 2011 లో బార్టీ 15 సంవత్సరాల వయసులో జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో జూనియర్ సర్క్యూట్లో అగ్రశ్రేణి ఆటగాళ్ళలో బార్టీ ఒకరు. అయితే 2014 లో ఆమె టెన్నిస్‌ను నిరవధికంగా విడిచిపెట్టింది. ఈ సమయంలో ఆస్ట్రేలియాలో దేశీయ క్రికెట్, బిగ్ బాష్ టి 20 లీగ్‌లో పాల్గొంది. 2016 లో మళ్ళీ టెన్నిస్‌కు తిరిగి వచ్చింది. 2019 లో బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో తన మొదటి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. దీంతో ఆమె జూన్ 2019 లో తొలిసారిగా నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్‌గా నిలిచింది. సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు టాప్ ర్యాంకును కొనసాగుతోంది.

Midhun Reddy: చంద్రబాబు ఆటలు మా వద్ద సాగవు : వైసీపీ ఎంపీలు.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

Dharmavaram: ధర్మవరం వైసీపీ నేత పుట్టినరోజు వేడుకల్లో కేకు తిన్న 20 మంది అస్వస్థత

చిన్నారుల పాలిట యమకింకరుల్లా కిడ్నాపర్లు..! బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో తెలీక తల్లడిల్లిపోతోన్న తల్లిదండ్రులు