Dharmavaram: ధర్మవరం వైసీపీ నేత పుట్టినరోజు వేడుకల్లో కేకు తిన్న 20 మంది అస్వస్థత

అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ కౌన్సిలర్ రమణ పుట్టినరోజు సందర్భంగా కేకు తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా మూడో వార్డు కౌన్సిలర్ రమణ బర్త్ డే...

Dharmavaram: ధర్మవరం వైసీపీ నేత పుట్టినరోజు వేడుకల్లో కేకు తిన్న 20 మంది అస్వస్థత
cake poison
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 10, 2021 | 9:52 PM

అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ కౌన్సిలర్ రమణ పుట్టినరోజు సందర్భంగా కేకు తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా మూడో వార్డు కౌన్సిలర్ రమణ బర్త్ డే సందర్భంగా శాంతినగర్​లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న వారికి కేకు పంచారు. దానిని తిన్న గంటలోనే పలువురికి కడుపులో తిప్పటం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధులు, చిన్నారులు అస్వస్థతకు గురైన వారిలో అధికంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. కేకు తిన్న కౌన్సిలర్ రమణ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే పలువురు అనారోగ్యానికి గురయ్యారని సిటీ పోలీసులు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాలో భర్తను చంపిన భార్య

విజయనగరం జిల్లా లంకవీధిలో దారుణం జరిగింది. భర్తను కత్తితో పొడిచి భార్య హత్య చేసింది. భర్త శ్రీనివాసరావు నిత్యం మద్యం తాగి వచ్చి కొడుతున్నాడని భార్య రెవల్ల గౌరి ఈ ఘాతుకానికి పాల్పడింది. లంకవీది నానజాతి పేటకు చెందిన రెవల్ల శ్రీనివాసరావు(42) మద్యానికి బానిసై భార్యను హింసిస్తున్నాడని టూ టౌన్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం భార్య గౌరీ వంట చేస్తుండగా.. భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి.. గొడవ చేశాడు. విసుగుచెందిన భార్య..భర్తను కూరగాయల చాకుతో పొడిచి హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి.. పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: ఇదో విచిత్రమైన టీవీ షో.. కేవలం 6 నిమిషాల పాటు యువతి పరిగెత్తుతూ ఉంటుంది.. అంతే

బీటెక్‌ విద్యార్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. పెళ్లి కానీ పురుషులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారానే.

మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!