Popular TV Show: ఇదో విచిత్రమైన టీవీ షో.. కేవలం 6 నిమిషాల పాటు యువతి పరిగెత్తుతూ ఉంటుంది.. అంతే

జపాన్లో బాగా పాపులర్ అయిన ఒక టీవీ షో గురించి మీకు చెప్పబోతున్నాం. సదరు షో గత 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తోంది. ఆరు నిమిషాల నిడివి గల కంటెంట్‌ను...

Popular TV Show: ఇదో విచిత్రమైన టీవీ షో.. కేవలం 6 నిమిషాల పాటు యువతి పరిగెత్తుతూ ఉంటుంది.. అంతే
Women Running Up A Hill
Follow us

|

Updated on: Jul 10, 2021 | 9:32 PM

జపాన్లో బాగా పాపులర్ అయిన ఒక టీవీ షో గురించి మీకు చెప్పబోతున్నాం. సదరు షో గత 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తోంది. ఆరు నిమిషాల నిడివి గల కంటెంట్‌ను ప్రతి ఎపిసోడ్‌లో ప్రదర్శిస్తారు. ఇంతకీ ఆ షోలో కంటెంట్ ఏముందో తెలిస్తే మీరు షాకవుతారు.  ప్రతి ఎపిసోడ్లో ఒక యువతి కేవలం మెరకగా ఉన్న రోడ్డుపై పరిగెత్తుతూ ఉంటుంది.  నటి, గాయని లేదా టీవీ ప్రెజంటర్లు అయిన మహిళలను ఈ షో కోసం తీసుకుంటారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో మహిళను క్యాస్ట్ చేస్తారు. ‘జెన్రియోకు జాకా’ అనే పేరుగల ఈ షో  అసహి టీవీలో ప్రసారం అవుతుంది. జపాన్లో ఎక్కువ కాలం నడుస్తున్న టీవీ షోలలో ఇది ఒకటి.  జపాన్‌లో రాత్రి 1:20 గంటలకు ఇది ప్రసారం అవుతుంది. గత పదిహేనేళ్లుగా, ఈ షోను చూడటానికి ప్రజలు అర్థరాత్రి వరకు మేల్కొనే ఉంటున్నారు. ఎపిసోడ్‌లో ఫోకస్ అంతా ఒక అమ్మాయిపై మాత్రమే ఉంటుంది. ఎపిసోడ్ ప్రారంభం నుండి ముగింపు వరకు సదరు యువతి పరిగెత్తడమే షో కంటెంట్. ఈ షోలో ఏ యువతినీ ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ చెయ్యరు. షో లొకేషన్ కూడా మార్చరు. టోక్యోలోని కొన్ని రోడ్లపై ఎపిసోడ్లను చిత్రీకరిస్తారు. షో యొక్క 3000 ఎపిసోడ్‌లను నిర్మాణ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. త్వరలో ఈ షో మేల్ వెర్షన్ కూడా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యువతులపై ఫోకస్ అలాగే ఉంటుందని జెన్రియోకు జాకా మేకర్స్ అంటున్నారు.