Copa America Final 2021: మెస్సీ లోటు తీరింది.. ఫైనల్‌లో బ్రెజిల్ పై అర్జెంటీనా అద్భుత విజయం..
అర్జెంటీనా, డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్ టీంలు హోరాహోరీగా తలపడిన కోపా అమెరికా ఫైనల్లో .. చివరికి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా టీం విజయం సాధించింది.
Copa America Final 2021: కోపా అమెరికా ఫైనల్లో తలపడుతోన్న అర్జెంటీనా, డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్ టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ఫైనల్ పోరులో గెలిచేందుకు ఇరుజట్లు గట్టిగానే పోరాడాయి. చివరకు అర్జెంటీనా టీం 1-0 తేడాతో బ్రెజిల్ ను ఓడించి, తన కలను నెరవేర్చుకుంది. ఆట మొదటి అర్థభాగంలో అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డీ అద్భుతంగా గోల్ చేయడంతో.. ఆ టీం 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక అక్కడి నుంచి మెస్సీ టీం వెనుదిరిగి చూడలేదు. అదే ఆధిక్యంతో టైటిల్ ను గెలుచుకుంది. బ్రెజిల్ ను గోల్ చేయనియకుండా అర్జెంటీనా ఆటగాళ్లు సఫలమయ్యారు.
అర్జెంటీనా సీనియర్ ఆటగాడు.. తన మొదటి అంతర్జాతీయ ట్రోఫీని గెలుచుకుని.. తన కలను నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనా తరపున అరంగేట్రం చేసిన తరువాత.. ప్రస్లుతం అంటే 16 ఏళ్ తరువాత తొలి అంతర్జాతీయ ట్రోఫీని గెలుచుకోవడం గమనార్హం. అలాగే అర్జెంటీనా టీం 28 సంవత్సరాల తరువాత ఓ ప్రధాన టైటిల్‌ను గెలుచుకుంది. 1937 తరువాత మొదటిసారి కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా టీం బ్రెజిల్ ను మట్టికరిపంచింది.
బ్రెజిల్ లోని రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇక అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయెనల్ మెస్సీ.. తన కెరీర్‌లో 35 టైటిల్స్ నెగ్గాడు. అంతకు ముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ లో విజేతగా నిలిచింది. ఇక 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ గా నిలిచింది.
ఇరు జట్లు కోపా అమెరికా ఫైనల్లో తలపడడం మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఆ మ్యాచ్ లో అర్జెంటీనా టీం ట్రోఫీని గెలుచుకుంది. అనంతరం 2004, 2007 సంవత్సరాల్లో బ్రెజిల్ టీం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మెస్సీ టీం గెలిస్తే కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచి, ఉరుగ్వే తో సమానంగా నిలించింది. ఉరుగ్వే ఇప్పటివరకూ 15 సార్లు ఈ టోర్నీలో గెలిచింది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్ 112 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. కాగా, 46 విజయాలతో బ్రెజిల్ ఆధిక్యంలో ఉండగా, అర్జెంటీనా టీం 41 సార్లు గెలిచింది.
అర్జెంటీనా ఎలెవన్: డామియన్ మార్టినెజ్, ఒటమెండి, అకునా, మోంటియల్, రొమెరో, డి పాల్, పరేడెస్, లో సెల్సో, మెస్సీ, డి మారియా, లౌతారో మార్టినెజ్
బ్రెజిల్ ఎలెవన్: ఎడెర్సన్, థియాగో సిల్వా, డానిలో, మార్క్విన్హోస్, రెనాన్ లోడి, కాసేమిరో, ఫ్రెడ్, ఎవర్టన్, లుకాస్ పాక్వెటా, రిచర్లిసన్, నేమార్
Messi is tossed in the air by his Argentina teammates.
It means everything ❤️pic.twitter.com/cIMJahlCAQ
— ESPN India (@ESPNIndia) July 11, 2021
Also Read:
Harbhajan Singh: రెండోసారి తండ్రైన హర్భజన్ సింగ్.. మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ ట్వీట్