AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌లో ఎన్‌ఐఏ దాడులు.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్టు.. ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు స్వాధీనం

NIA Raids: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది. దేశంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ..

జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌లో ఎన్‌ఐఏ దాడులు.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్టు.. ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు స్వాధీనం
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: Jul 11, 2021 | 11:07 AM

Share

NIA Raids: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది. దేశంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తూ, మరోవైపు జవాన్లపైకి కాల్పులకూ తెగబడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే భారత సరిహద్దుల వెంట హై టెక్నాలజీ కెమెరాలను, సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశం సరిహద్దులు దాటుకుని వచ్చేందుకు కొందరు టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదుల చోరబాటు రోజురోజుకు పెరుగుతుండటంతో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెంచారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. గత వారం పది రోజుల్లో భారత భద్రతా బలగాలు దాదాపు పదిమందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (NIA) దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఐదుగురు ఆఫ్గనిస్తాన్ పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. దారుల్ ఉలూమ్ ఇన్‌స్టిట్యూట్ పైన కూడా ఎన్ఐఏ దాడులు చేసింది. అక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు ల్యాప్ ట్యాప్‌తో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ చైర్మన్‌ని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

జమ్మూకశ్మీర్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాదుల చోరబాటును భారత భద్రత బలగాలు రంగంలోకి దిగి మట్టుబెడుతున్నాయి. భారత్‌లో భారీ కుట్ర పన్నేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు భగ్నం చేస్తున్నాయి. గత మూడు రోజుల కిందట జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో ఎన్​కౌంటర్​ జరిగింది. పుచల్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అదే సమయంలో కుల్గాం ప్రాంతంలో లష్కరే తొయిబా ఉగ్రసంస్థతో సంబంధాలున్న మరో ఇద్దరు ముష్కరులను భద్రతదళాలు హతమార్చాయి. ఒక రోజులో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఎన్‌కౌంటర్‌ జరిపినందుకు సిబ్బందిని కశ్మీర్ ఐజీ​ విజయ్​ కుమార్​ అభినందించారు. సైన్యం, స్థానిక పోలీసులు కలిసి వేర్వేరు ప్రాంతాల్లో నిర్బంధ సోదాలు నిర్వహిస్తుండగా.. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇంకా ముష్కరుల వేట కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారం వ్యవధిలో దాదాపు పది మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

ఇవీ కూడా చదవండి:

World Population Day 2021: రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రపంచ జనాభా.. 2050 నాటికి ఎంత జనాభా పెరుగుతుందో తెలుసా..?

వీడికి చిన్నారులు కనిపిస్తే చాలు కాటేస్తాడు.. చిన్నారుల లైంగిక దాడిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు

Dog: పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!