AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor District: సొంత మనవరాలినే కిడ్నాప్ చేసిన అమ్మమ్మ, ఎందుకో తెలిస్తే షాకే..

తిరుపతి తిరుచానూరులో ఓ బాలిక కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఐతే ఇక్కడ కిడ్నాప్‌ చేసింది ఎవరో గుర్తుతెలియని దుండగులు కాదు...

Chittoor District: సొంత మనవరాలినే కిడ్నాప్ చేసిన అమ్మమ్మ, ఎందుకో తెలిస్తే షాకే..
Girl Kidnap
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2021 | 12:51 PM

Share

తిరుపతి తిరుచానూరులో ఓ బాలిక కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఐతే ఇక్కడ కిడ్నాప్‌ చేసింది ఎవరో గుర్తుతెలియని దుండగులు కాదు.. సొంత అమ్మమ్మే మనవరాలిని కిడ్నాప్‌ చేసింది. ఎస్‌..తన మనవడితో బలవంతంగా పెళ్లి జరిపించేందుకే మనవరాలిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయింది. తిరుచానూరు పీఎస్‌‌లో యువతి తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నాప్‌ వ్యవహారం వెలుగులోకొచ్చింది. 4 రోజులుగా యువతి అమ్మమ్మ, ఆమె కుటుంబం కూడా అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే… తిరుచానూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళకు చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమెకు 14ఏళ్ల కుమార్తె ఉంది. లక్ష్మి తల్లి ఓబుళమ్మ, అన్నవదినలు చిత్తూరులో నివాసం ఉంటున్నారు. లక్ష్మి అన్నవదినలకు మురళీ కృష్ణ(29) అనే కుమారుడు ఉన్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే మురళీకృష్ణకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కూతురి బిడ్డను ఇచ్చి చేయాలని ఓబుళమ్మ అనుకుంది. ఇదే విషయాన్ని తన కూతురికి చెప్పగా.. “పిల్లకి 14ఏళ్లు కూడా నిండలేదు, బాగా చదువుకుంటోంది, అయినా ఇద్దరికి 15ఏళ్ల వయసు తేడా ఉంది..” అని లక్ష్మి పెళ్లికి ససేమేరా అంది. అయినా సరే మేనకోడలిని తమ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలంటూ అన్నావదిలను కూడా లక్ష్మిపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. ఎంత చెప్పినా కూతురు తమ మాట వినకపోవడంతో ఓబుళమ్మకు కోపం వచ్చింది. మనవరాలిని తన మనవడికి ఇచ్చి ఎలాగైనా పెళ్లి చేయాలని డిసైడయ్యింది. శనివారం కిరాయి మనుషులతో తన మనవరాలిని కిడ్నాప్ చేయించింది. తన కూతురిని తల్లే కిడ్నాప్ చేయించిందని తెలిసుకున్న లక్ష్మి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అభిప్రాయ భేదాలతో 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.. మళ్లీ ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారు

 సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు….