జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కొడుకులకు షాక్.. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగింపు
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్య తీసుకుంది. వాంటెడ్ లిస్టులో ఉన్న టెర్రరిస్టుల కొడుకులను , వారితో లింక్ గలవారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. రాజ్యాంగం లోని 311(2) అధికరణం కింద అధికారిక కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం...
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్య తీసుకుంది. వాంటెడ్ లిస్టులో ఉన్న టెర్రరిస్టుల కొడుకులను , వారితో లింక్ గలవారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. రాజ్యాంగం లోని 311(2) అధికరణం కింద అధికారిక కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. సయ్యద్ సలాఉద్దీన్ అనే ఉగ్రవాది కొడుకులైన సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్ ఇద్దరూ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని, వీరు హవాలా మార్గాల ద్వారా సొమ్ము సేకరించి ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ కు పంపుతున్నారని అధికారులు కనుగొన్నారు. జాతీయ భద్రతా సంస్థ దర్యాప్తులో కూడా ఈ విషయం వెల్లడైంది. అదే విధంగా మరో 11 మందిని కూడా ప్రభుత్వ జాబ్స్ నుంచి తొలగించారు.
వీరిలో కొందరు జమ్మూ కాశ్మీర్ విద్యా శాఖలోనూ, కొందరు విద్యుత్, ఆరోగ్య శాఖల్లోనూ మరికొంతమంది పోలీసు శాఖలో కూడా పని చేస్తున్నట్టు ఈ కమిటీ తెలిపింది. ఇద్దరు కానిస్టేబుల్స్, ఓ ఇన్స్పెక్టర్ పై సైతం వేటు పడింది. ప్రజలను రక్షించాల్సిన వీరు అందుకు వ్యతిరేకంగా టెర్రరిస్టులతో చేతులు కలపడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ పోలీసు ఉద్యోగులు టెర్రరిస్టులకు సమాచారాన్ని చేరవేయడమే కాకా, వారికి ఆయుధాలను అందజేయడంలోనూ సహకరించారట. ఒక అధికారి అయితే ఓ ఉగ్రవాదికోసం జమ్మూ నుంచి ఢిల్లీకి రహస్యంగా ఆయుధాలను తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు టీచర్లు కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. వీరిని కూడా డిస్మిస్ చేశారు. ఇకపై ఈ విధమైన చర్యలు తీసుకుంటూనే ఉంటామని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : దేవుడితోనైనా కొట్లాడతాం..:కేటీఆర్.మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
భారత్ లో మల్లి మొదలైన డెల్టా వేరియంట్ టెన్షన్ లైవ్ వీడియో..:Delta Variant Live Video.