Blue Hole: మెక్సికో సముద్రగర్భంలో 900 అడుగుల లోతైన భారీ బిలం.. ప్రపంచంలోనే రెండోదిగా గుర్తింపు..
మెక్సికో సముద్రగర్భంలో అతి లోతైన భారీ బిలం బయటపడింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బిలంగా చరిత్రకెక్కింది. యుకాటన్ ద్వీపకల్ప తీరంలో కనుగొన్నారు సైంటిస్టులు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన భారీ బిలం టామ్ జాను మెక్సికో సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇది సుమారు 900 అడుగుల లోతు, 1,47,00 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రగర్భంలో 900 అడుగుల లోతైన భారీ బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బిలమని తెలిపారు. దీనిని మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం తీరంలో చేటుమల్ బేలో కనుగొన్నారు. దీనికి టామ్ జా అని పేరు పెట్టారు. టామ్ జా అంటే మయన్ భాషలో లోతైన నీరు. వాస్తవానికి.. ఈ భారీ బిలాన్ని 2021లో కనుగొన్నారు.
ఈ విషయాన్ని ఫ్రాంటియర్ ఇన్ మెరైన్ సైన్స్ అనే సైంటిఫిక్ జర్నల్ ఇటీవలే ప్రచురించింది. దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్న ‘డ్రాగన్ బిలం’ ప్రపంచంలోనే అతిపెద్దది. దాని తర్వాతి స్థానం టామ్ జా ఆక్రమించింది. ఈ బిలాల్లో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సూర్య కిరణాలు ఉపరితలం వరకే ప్రసరిస్తాయి. దీని అడుగుభాగంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. బిలాల్లోని ప్రత్యేక పరిస్థితులు శిలాజాలను సంరక్షించడానికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా అంతరించిపోయిన జాతులను గుర్తించడంలో ఇవి సహాయపడతాయని చెప్పారు.
2012లో బహమాస్ దేశంలోని బిలాల్లో ఇతర జీవులు ఏవీ మనుగడ సాగించలేని చోట బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇతర గ్రహాలపైనా మనుగడ సాగించగల జీవరకాలపై కీలక సమాచారాన్ని అందించారు. ఇక.. గతంలోనూ మెక్సికోలోని శాంటా మారియా జకాటెబెక్‌లో అకస్మాత్తుగా ఒక భారీ బిలం ఏర్పడింది. వాస్తవానికి.. ఒక చిన్న గుంతలా ఉండే ఈ సింక్ హోల్ రోజురోజుకు పెద్దదిగా పెరుగుతున్నట్లు నివేదించబడింది. పెరుగుతున్న ఈ అగాధం మెక్సికోలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. శాంటా మారియా జాకాట్‌బెక్‌లో కనిపించిన అగాధం నీటితో నిండి ఉంది. మెక్సికో సిటీ నుండి 80 మైళ్ళ దూరంలో ఉంది. ఈ బిలం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే చాలా వేగంగా పెరిగింది.
మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..