Jagannath Temple: లండన్ లో జగన్నాథ ఆలయ నిర్మాణం.. రూ.250 కోట్లు విరాళమిచ్చిన భారత పారిశ్రామికవేత్త

లండన్ శివార్లలోని 15 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయల వసూళ్లతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశ నిర్మాణం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

Jagannath Temple: లండన్ లో జగన్నాథ ఆలయ నిర్మాణం..  రూ.250 కోట్లు విరాళమిచ్చిన భారత పారిశ్రామికవేత్త
Jagannath Temple Uk
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 26, 2023 | 4:50 PM

శ్రీ జగన్నాథ్ సొసైటీ UK లండన్‌లో ఆలయాన్ని నిర్మించేందుకు ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ నిధులు సేకరించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ ప్రయత్నానికి సహాయం చేయడానికి ఉదారంగా 250 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. భారతదేశం వెలుపల విదేశాల్లో నిర్మిస్తున్న ఆలయానికి ఇంత భారీ మొత్తంలో విరాళం రావడం ఇదే తొలిసారి. బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. పట్నాయక్ ఒడిశానుంచి బ్రిటన్ కు వచ్చారు. ఈ మొత్తాన్ని అక్షయ తృతీయ సందర్భంగా గత ఆదివారం అందజేసినట్టుగా లండన్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది.

బ్రిటన్ లో బిశ్వనాథ్ పెట్టుబడుల సంస్థ ఫిన్ నెస్ట్ కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆయనే ఆ కంపెనీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు లండన్ శివారులో జగన్నాథ్ స్వామి ఆలయం నిర్మించేందుకు అక్కడి స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ యూకే అనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. లండన్ శివార్లలోని 15 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయల వసూళ్లతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశ నిర్మాణం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బ్రిటన్, ఐర్లాండ్ నలుమూలల నుండి 600 మందికి పైగా భక్తులు ఆలయానికి విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా, బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయంలో కాన్సుల్ జనరల్ సుజిత్ ఘోష్, మంత్రి మరియు రచయిత అమిష్ త్రిపాఠి విరాళాలు అందించిన ప్రముఖులలో ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన ఎన్నికల ప్రచార సమయంలో జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. .

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు