Watch: పానీపూరీని ఇంకెన్ని రకాలుగా పాడుచేస్తార్రా బాబు..! ఈ సారి మామిడి రసంతో.. అవాక్కవుతున్న నెటిజన్లు

ప్రస్తుతం ఈ విషయం మీద ఇంటర్నెట్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఆహారంతో తయారుచేసే వెరైటీ కాంబినేషన్స్, ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ పాపులారీలపైనే చేస్తారా అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.

Watch: పానీపూరీని ఇంకెన్ని రకాలుగా పాడుచేస్తార్రా బాబు..!  ఈ సారి మామిడి రసంతో.. అవాక్కవుతున్న నెటిజన్లు
Mango Pani Puri
Follow us

|

Updated on: Apr 26, 2023 | 3:34 PM

వేసవి వచ్చేసింది. మండే ఎండలతో పాటు కమ్మటి మామిడి పండ్లు ప్రజల్ని నోరూరిస్తుంటాయి. సీజనల్‌గా వచ్చే మామిడి పండ్లను ప్రజలు పలు రకాలుగా ఆస్వాదిస్తుంటారు. కచ్చి మామిడి కాయలు తింటారు. పండ్లు, రసాలు బాగా ఇష్టపడుతుంటారు. మ్యాంగో జ్యూస్‌తో పాటుగా మామిడి ఐస్ క్రీం కూడా తయారు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మామిడి ప్రియులు వాటిని ఎన్ని రకాలుగా తినొచ్చు అన్ని వెరైటీలు లాగించేస్తుంటారు. కానీ, మామిడి పండ్లతో ఇలాంటి విచిత్ర వంటకం గతంలో ఎప్పుడూ చూసుండరు. మామిడికాయాలు, పండ్లతో ఎన్నో రకాల వంటకాలు చూశాం గానీ, ఇలాంటి కొత్త వంటకాన్ని చూడటం ఇదే తొలిసారి అనుకుంటా బహుశ. పండ్లలో రారాజు అయిన మామిడి పండుతో తయారు చేసిన ఈ కొత్త వంటకం పానీపూరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వంటకం చూసిన ఆహార ప్రియులు తీవ్రంగా స్పందించారు.

మన దేశంలో పానీపూరీ బాగా ఫేమస్‌గా చెప్పుకునే ఒక స్ట్రీట్ ఫుడ్ ఐటమ్‌. పానీపూరీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, పానీ పూరీని వెరైటీగా అందించాలనే తాపత్రయంతో ఈ సారి మరో కొత్త ప్రయోగం వెలుగులోకి వచ్చింది. పానీపూరీలో పానీకి బదులు మామిడి రసాన్ని వాడుతున్నారు. అవును, ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కాబట్టి అందుకు అనుగుణంగా, మామిడిరసాన్ని పానీపూరీలో అందిస్తున్నారు. ఈ వెరైటీ కాంబేషన్ కు మిశ్రమ స్పందన వస్తోంది. మామిడి రసంతో తయారు చేసిన పానీపూరీ చూసిన కొందరు నెటిజన్లు బాగుందని అంటే, మరికొందరేమో అస్సలు బాలేదని, చెత్తగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద ఇంటర్నెట్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఆహారంతో తయారుచేసే వెరైటీ కాంబినేషన్స్, ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ పాపులారీలపైనే చేస్తారా అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మ్యాంగో పానీపూరీ వీడియోను @bombayfoodie_tales అనే వినియోగదారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 9 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు
మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు
భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..
భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..
మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?
మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!