Telugu News India News 10 police personnel, driver killed in blast by Maoists in Chhattisgarh's Dantewada Telugu News
మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి.. పలువురికి గాయాలు
ఈ దాడిలో 11 మంది జవాన్లు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది డీఆర్‌ఎఫ్ పోలీసులు , డ్రైవర్ ఉన్నారు. పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు.
చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. దంతేవాడ జిల్లా అరన్‌పూర్‌లో మావోయిప్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది జవాన్లు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది డీఆర్‌ఎఫ్ పోలీసులు , డ్రైవర్ ఉన్నారు. పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల దాడిలో పోలీసుల వాహనం ధ్వంసమయ్యింది. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. మందుపాతర పేల్చిన తరువాత మావోయిస్టులు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనపై చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాగేల్‌తో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మావోయిస్టులపై పోరులో రాష్ట్రానికి పూర్తి సహకరం అందిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనపై ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మృతిచెందిన వారిపట్ల తన ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు.
दंतेवाड़ा के थाना अरनपुर क्षेत्र अंतर्गत माओवादी कैडर की उपस्थिति की सूचना पर नक्सल विरोधी अभियान के लिए पहुंचे डीआरजी बल पर आईईडी विस्फोट से हमारे 10 डीआरजी जवान एवं एक चालक के शहीद होने का समाचार बेहद दुखद है।
దట్టమైన అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైన సమాచారంతో కూంబింగ్‌కు బయలుదేరారు డీఆర్‌జీ పోలీసులు. అదను చూసి పోలీసుల వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు. పేలుడులో పోలీసుల వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ మధ్య కాలంలో చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు ఇంత పెద్ద దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం అంటే ఏప్రిల్ 4 , 2021న దంతేవాడలో మావోయిస్టుల దాడిలో 22 మంది పోలీసులు చనిపోయారు.
మావోయిస్టుల దాడిలో 11 మంది జవాన్ల మృతిని ధృవీకరించారు చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాగేల్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దాడికి పాల్పడ్డ మావోయిస్టులకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. మావోయిస్టులపై యుద్దం అంతిమదశలో ఉందన్నారు.