Ashwini Vaishnav: ముఖంపై దుమ్ముందని.. అద్దాన్ని శుభ్రం చేస్తామా.. ముఖ్యమంత్రి ‘ప్యాలెస్’పై రైల్వే మంత్రి సెటైర్లు..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభుత్వ బంగ్లా సుందరీకరణ ఖర్చుపై బీజేపీ టార్గెట్ చేసింది. వివమర్శల దాడిని తీవ్రస్థాయిలో పెంచింది. ప్రభుత్వ భవనంలో మార్పులు చేసేందుకు రూ.45 కోట్లతో ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. తాజాగా కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్..

Ashwini Vaishnav: ముఖంపై దుమ్ముందని.. అద్దాన్ని శుభ్రం చేస్తామా.. ముఖ్యమంత్రి 'ప్యాలెస్'పై రైల్వే మంత్రి సెటైర్లు..
Ashwini Vaishnav
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 26, 2023 | 3:15 PM

అవినీతి అంశంపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బంగ్లా విషయంలో టార్గెట్‌గా మారింది. ప్రభుత్వ నిధుల నుంచి రూ.45 కోట్లు వెచ్చించి కేజ్రీవాల్ తన బంగ్లాను పునరుద్ధరించారని బీజేపీ ఆరోపించింది. ఇదే అంశంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖంపై దుమ్ము ఉందని అద్దాన్ని శుభ్రం చేస్తున్నట్లుగా(ధూల్ చేహరే పర్ థీ.. వో ఐనా సాఫ్ కరనే కా నాటక కరతే రహే) ఆమ్ ఆద్మీ పార్టీ తీరు ఉందని విమర్శించారు. తన ట్వీట్‌ హాండిల్‌లో ఈ పోస్ట్ పెట్టారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఎత్తకుండా విమర్శించారు. అయితే, అతను తన ట్వీట్‌లో ఖచ్చితంగా ఆపరేషన్ శీష్ మహల్( అద్దాల బంగళా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు.

కేజ్రీవాల్ తన అధికారిక నివాసం సుందరీకరణకు దాదాపు రూ.45 కోట్లు ఖర్చు చేశారని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ విమర్శిస్తోంది. కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

ఐదుసార్లు దాదాపు 45 కోట్ల రూపాయలు..

దేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, కేజ్రీవాల్ తన బంగ్లాను ప్యాలెస్‌ను అందంగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని బిజెపి నాయకుడు, అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా బుధవారం విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ మొత్తం ఐదుసార్లు ఇందు కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారని పాత్రా మండిపడ్డారు.

2020 సెప్టెంబర్ 1న కేజ్రీవాల్ తొలిసారిగా రూ.7.91 కోట్లు.. దీని తర్వాత, 2021లో, రూ. 15 కోట్లకు పైగా మొత్తం మూడు సార్లు రీ-రిలీజ్ చేయబడింది. దీని తర్వాత, జూన్ 29, 2022న మరోసారి రూ.9 కోట్ల 9.34 కోట్లు విడుదలయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం