Watch: ఎన్నికల ప్రచారం.. హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమె వెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే శివకుమార్, కర్ణాటక ఎన్నికల అధికారి రణదీప్ సింగ్ సుర్జీవాలా ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతలు ఢిల్లీ నుంచి గల్లీల దాకా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ హోంమంత్రి అమిత్ షా గత వారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ పార్టీ 1.50 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
ఎన్ని కల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ బుధవారం ఉదయం మైసూరులోని ప్రముఖ మైలారీ హోటల్‌లో అల్పాహారం చేశారు. అనంతరం అదే హోటల్‌లో దోసెలు వేసేందుకు ప్రయత్నించారు ప్రియాంక గాంధీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Perfect dosas are just the beginning; with such skillful hands, there’s no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ
— Congress (@INCIndia) April 26, 2023
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, ప్రియాంక గాంధీ హోటల్ వంటగదిలో, సిబ్బందితో మాట్లాడడం, దోసెలు వేయడం.. దోసెలు తిప్పడం కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్ మైలారి హోటల్, మైసూరులోని పురాతన ఫుడ్ జాయింట్‌లలో ఒకటి. దోసెలు వేసిన తరువాత ప్రియాంక గాంధీ హోటల్ యజమానికి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారితో సెల్ఫీ దిగారు.
ఆమె వెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే శివకుమార్, కర్ణాటక ఎన్నికల అధికారి రణదీప్ సింగ్ సుర్జీవాలా ఉన్నారు. అనంతరం మైసూరులో ప్రచారానికి బయల్దేరారు. నిన్న ఎన్నికల ప్రచారం అనంతరం హనూర్‌లోని హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో బస చేశారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..