Viral: లీవ్ తీసుకున్నందుకు ఉద్యోగం పోయింది.. కట్ చేస్తే.. చివరికి దిమ్మతిరిగింది.!
ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడొక వ్యక్తి అదేవిధంగా చేసింది. తన టూర్ ప్లాన్ అంతా సిద్దం చేసుకున్నాడు. టికెట్స్ బుక్ చేసుకుంది. చివరికి కంపెనీలో..
సాధారణంగా మనం వేరే ఊరు వెళ్లేటప్పుడు కచ్చితంగా పని చేస్తోన్న కంపెనీలో ముందుగా చెప్పి.. ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడొక వ్యక్తి అదేవిధంగా చేసింది. తన టూర్ ప్లాన్ అంతా సిద్దం చేసుకున్నాడు. టికెట్స్ బుక్ చేసుకుంది. చివరికి కంపెనీలో మేనేజర్‌కు ఓ మాట చెప్పాడు. కట్ చేస్తే.. ఆ మేనేజర్ వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని సెలవులు ఇవ్వలేదు. అయితే చివరికి ఏం జరిగిందో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగరడం ఖాయం. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీజింగ్‌లోని ఓ ప్రముఖ టెక్ కంపెనీలో జు అనే ఓ వ్యక్తి 1998వ సంవత్సరం నుంచి పని చేస్తున్నాడు. జూలై 2019లో అతడు ఓ పని మీద విదేశాలకు వెళ్లాల్సి వచ్చి.. రెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు కావాలని దరఖాస్తు చేసుకుంది. అయితే వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం, అలాగే సరిపడ్డా స్టాఫ్ లేకపోవడంతో.. అతడికి మేనేజర్ సెలవులు ఇవ్వలేమని చెప్పి.. జు పెట్టుకున్న దరఖాస్తును రిజెక్ట్ చేశాడు. అయితే అప్పటికే జు తన బిడ్డతో కలిసి చైనాలోని దక్షిణ ద్వీపం హైనాన్‌కు వెళ్లేందుకు టికెట్లు కూడా కొనుగోలు చేసుకున్నానని.. అడిగిన సెలవులు మంజూరు చేయాలంటూ కోరాడు. అయినా కూడా మేనేజర్ సెలవులను ససేమిరా మంజూరు చేయలేదు.
దీనితో జు చేసేదేమీలేక 14 రోజుల సిక్ లీవ్ కోసం దరఖాస్తు చేశాడు. అందుకు అనుగుణంగా ఓ మెడికల్ సర్టిఫికేట్‌ను కూడా సిద్దం చేసుకున్నాడు. అందులో అతడు “వెర్టిగో సర్వైకల్ స్పాండిలోసిస్” అనే వ్యాధితో వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు ఆ రిపోర్టు ప్రకారం, జుకు బెడ్ రెస్ట్, మెడ వ్యాయామాలు అవసరం. ఇక ఈసారి సిక్ లీవ్‌కు ఆమోదముద్ర పడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. జు తన కొడుకుతో కలిసి హైనాన్ విమానాశ్రయంలో తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు.. సహోద్యోగి కంటపడ్డాడు. ఆ కొలీగ్ వెంటనే మేనేజర్‌ను అప్రమత్తం చేయడంతో.. అబద్దం చెప్పి జు సెలవు తీసుకుందని నిర్ధారించి.. ఉద్యోగం నుంచి తొలగించారు.
తాను చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లాలని.. ఎంజాయ్ చేయడానికి కాదంటూ బీజింగ్ చాయోయాంగ్ ఆర్బిట్రేషన్ కమిషన్‌ను ఆశ్రయించాడు సదరు వ్యక్తి. ఇక అక్కడ తీర్పు జుకి అనుకూలంగా రావడమే కాదు.. అతడికి కంపెనీ రూ. 73 లక్షల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఇంకేముంది స్టోరీ అయిపోయిందని అనుకోవద్దు. ఇక్కడే క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది.
సదరు టెక్ కంపెనీ దీనిపై బీజింగ్ థర్డ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టుకు వెళ్ళింది. అక్కడ న్యాయస్థానం టెక్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జు తన కంపెనీకి అబద్ధం చెప్పిందని, మెడికల్ సర్టిఫికేట్ పరంగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన ఎలాంటి అవసరం లేదని న్యాయస్థానం గుర్తించింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాడాన్ని కోర్టు సమర్థించింది. అంతేకాదు జుకు ఎలాంటి పరిహారం చెల్లించవద్దని తీర్పునిచ్చింది. ఏప్రిల్ రెండో వారంలో ఈ కేసును కోర్టు తన తీర్పును వెల్లడించింది.(Source)