Flight Diverted: ఢిల్లీ- దోహా విమానంలో పొగలు.. కరాచీకి దారి మళ్లింపు.. ఫ్లైట్‌లో ఎంతమంది ఉన్నారంటే..
ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానిని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు.
ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానిని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. వివరాల్లోకి వెళ్లితే ఈరోజు(మార్చి21) ఉదయం 3.50 నిమిషాలకు ఢిల్లీ (Delhi) నుంచి ఖతార్ రాజధాని దోహాకు ఖతార్ ఎయివేస్ కు చెందిన QR579 విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అవ్వగానే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కార్గో హెల్డ్ లో పొగలు వస్తుండటంతో 5.30 గంటలకు ఫ్లైట్‌ను కరాచీ (Karachi) ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ తరువాత ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు.
నీళ్లు కూడా ఇవ్వట్లేదు..
కాగా ప్రమాద సమయంలో విమానంలో మొత్తం వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కాగా ఈ సంఘటనకు గల కారణాలను కనుగొనే పనిలో ఎయిర్‌వేస్ ప్రతినిధులు తలమునకలయ్యారు. విమానంలో సమస్యలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులను వేరే విమానంలో దోహా తరలించేందుకు మరో రిలీఫ్ విమానాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా విమానంలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వారికి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Qatar Airways QR579 diverted to Pakistan (Karachi) airport due to technical reasons. The flight was scheduled from Delhi to Doha. Over 100 passengers on board. Details awaited
— ANI (@ANI) March 21, 2022
Pakistan PM Imran Khan: పదవి ఉంటుందా.. ఊడిపోతుందా? ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలేది ఆ రోజే..
AP Assembly: విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!