China Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికుల దుర్మరణం..
Plane Crash In China: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ 737 విమానంలో ప్రయాణం
Plane Crash In China: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ 737 విమానంలో ప్రయాణం చేస్తున్న 133 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దక్షిణ చైనా గ్వాంగ్‌జీ జియాంగ్ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో విమానం కుప్పకూలింది. మంటలు చెలరేగి విమానం కుప్పకూలినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. కన్‌మింగ్ నుంచి గ్వాంగ్‌జాంగ్ ప్రాంతానికి విమానం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 133 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం టెంగ్ కౌంటీ, వుజౌ, గ్వాంగ్జీలో సాంకేతిక లోపంతో కుప్పకూలినట్లు పేర్కొంటున్నారు. ఎత్తైన పర్వత శిఖరం, దట్టమైన చెట్ల మధ్య విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగిలివుండకపోవచ్చని పేర్కొంటున్నారు.
చైనాలోని కున్మింగ్ నుంచి గ్వాంగ్‌జౌకి ప్రయాణిస్తున్న ఈ విమానం మధ్యాహ్నం 1.11 గంటలకు బయలుదేరింది. ఫ్లైట్ ట్రాకింగ్.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.22 గంటలకు 3225 అడుగుల ఎత్తులో 376 కి.మీ వేగంలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది మధ్యాహ్నం 3.05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. చైనా ఎయిర్‌లైన్ డేటా ప్రకారం.. గత దశాబ్ద కాలంలో ఇదే ఘోర ప్రమాదమని అధికారులు పేర్కొన్నారు.
#China Unconfirmed new video appears to show the crash site of the Boeing 737 with significant fire in the mountains. pic.twitter.com/S62uOQ0uqn
— Shane B. Murphy (@shanermurph) March 21, 2022
ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ ప్రకారం, చైనాలో అంతకుముందు 2010లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. హెనాన్ ఎయిర్‌లైన్స్ కి విమానం కుప్పకూలిన ఘటనలో 44 మంది మరణించారు.
#China https://t.co/4Lkda7YCIm
— Shane B. Murphy (@shanermurph) March 21, 2022
Also Read: