AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel PM Tour: తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్న ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ వచ్చే నెల అంటే ఏప్రిల్ 2న తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకార విస్తరణపై చర్చలు జరగనున్నాయి.

Israel PM Tour: తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్న ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
Israel Pm India Tour
Balaraju Goud
|

Updated on: Mar 21, 2022 | 12:23 PM

Share

Israel PM India Tour: ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్(Naftali Bennett) వచ్చే నెల అంటే ఏప్రిల్ 2న తొలిసారిగా భారత్‌(India)లో పర్యటించనున్నారు. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకార విస్తరణపై ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో  చర్చలు జరపనున్నారు. దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ మొదటి వారంలో తాను భారత్‌లో పర్యటిస్తానని నఫ్తాలీ బెన్నెట్ తెలిపారు. అలాగే భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు అర్థవంతమైన సహకారంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ ఏప్రిల్ 2వ తేదీన భారత్‌లో తన మొదటి అధికారిక పర్యటనను చేస్తారని ఇజ్రాయెల్ ప్రధాని మీడియా సలహాదారు తెలిపారు. గత అక్టోబరులో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు (COP-26)లో ఇరువురు నేతల తొలి సమావేశం జరిగినట్లు ప్రకటన పేర్కొంది. భారతదేశానికి అధికారిక పర్యటన కోసం పిఎం బెన్నెట్‌ను పిఎం మోడీ ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. నూతన ఆవిష్కరణ, సాంకేతికత, భద్రత, సైబర్ వ్యవహారాలు, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడం కూడా ఈ పర్యటన లక్ష్యంగా ఉందని నఫ్తాలి వెల్లడించినట్టు ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.

బెన్నెట్ మాట్లాడుతూ, “నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారతదేశానికి నా మొదటి అధికారిక పర్యటన చేయడానికి నేను చాలా సంతోషంగా, ఆసక్తిగా ఉన్నాను.” మ‌న దేశాల మ‌ధ్య సంబంధాల కోసం మ‌నం ముందుకు సాగుతూనే ఉంటాం. భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను మోదీ పునరుద్ధరించారని బెన్నెట్ చెప్పారు. భారతీయ సంస్కృతి మరియు యూదు సంస్కృతి మధ్య సంబంధం చాలా లోతైనది. అలాగే భారత్ అర్థవంతమైన సహకారంపై తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. భారతీయుల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, బెన్నెట్ ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 5 వరకు నాలుగు రోజుల పర్యటనలో భారతదేశాన్ని సందర్శిస్తారు. బెన్నెట్ తన పర్యటనలో తన భారతీయ కౌంటర్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, స్థానిక యూదు సమాజాన్ని కూడా కలుస్తారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశం. అలాగే, ఇన్నోవేషన్, ఎకానమీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో సహా అనేక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరుగుతాయి.

Read Also….

Khalid Payenda: ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పాడు.. ఇప్పుడు కుటుంబ పోషణకు స్టీరింగ్ పట్టాడు.. తలకిందులైన మాజీ మంత్రి జీవనం

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ