Khalid Payenda: ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పాడు.. ఇప్పుడు కుటుంబ పోషణకు స్టీరింగ్ పట్టాడు.. తలకిందులైన మాజీ మంత్రి జీవనం

అఫ్గానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయెండా(Khalid Payenda) అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉబర్ సర్వీసులను నడుపుతున్నారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ పని చేస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. కాబూల్ తాలిబాన్ల...

Khalid Payenda: ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పాడు.. ఇప్పుడు కుటుంబ పోషణకు స్టీరింగ్ పట్టాడు.. తలకిందులైన మాజీ మంత్రి జీవనం
Khalid Payenda
Follow us

|

Updated on: Mar 21, 2022 | 11:44 AM

అఫ్గానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయెండా(Khalid Payenda) అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉబర్ సర్వీసులను నడుపుతున్నారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ పని చేస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. కాబూల్ తాలిబాన్ల చేతిలో పడకముందే ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన ఖలీద్ పయెండా.. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉబెర్ సర్వీసులతో పాటు, జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో (University) అనుబంధ ఆచార్యుడిగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఈయన అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో చివరి ఆర్థిక మంత్రి (Finance Minister) కావడం గమనార్హం. ఈ పని చేస్తున్నందుకు తానెంతో సంతోషంగా ఉన్నానని, నిరాశ చెందాల్సిన పనేముందని అన్నారు. తాను ఏ ప్రాంతానికి చెందిన వాడిని కాదని, కుటుంబ పోషణ కోసం ఈ పని చేయడంలో తప్పేమీ అనిపించడం లేదని వెల్లడించారు. అప్ఘాన్లను అమెరికా అనాథలుగా వదిలేసిందని, అఫ్ఘనిస్థాన్ ను సమష్టిగా నిర్మించుకుందామనే సంకల్పం కూడా లేదన్నారు. తాము అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నామని, అందుకే అంత వేగంగా కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అష్రఫ్ ఘని అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో అఫ్గానిస్థాన్ లో మంత్రి ఖలీద్ పయేందా కీలక పాత్ర పోషించారు. ఆర్థిక మంత్రి హోదాలో అమెరికా నుంచి వచ్చే భారీ సహాయం లెక్కలను ఆయనే చూసుకునేవారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారాలు కూడా ఖలీద్ కనుసన్నల్లోనే జరిగేవి. లెబనాన్ కు చెందిన ఓ కంపెనీ నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఖలీద్ పై ఆరోపణలున్నాయి. లెబనీస్ కంపెనీకి చెల్లింపులు చేయడంలో విఫలమైందంటూ అష్రఫ్ ఘనీ ఆర్థిక శాఖను ఎత్తి చూపడంతో.. తప్పుడు ఆరోపణల కింద నన్ను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో స్వదేశాన్ని వీడి అమెరికాకు చేరుకున్నారు.

‘నాకంటూ ఓ చోటు లేదు.నా ఈ పరిస్థితికి ఎవరినీ నిందించలేను. జీవితం శూన్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే, మేమంతా అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నాం. అంతే వేగంగా అది కుప్పకూలింది. మా ప్రజలకు మేమే ద్రోహం చేశాం. చేసిన పాపం ఊరికే పోదంటారు. బహుశా అందుకే నాకీ దుస్థితి కలిగిందేమో’                     – ఖలీద్ పయెండా, అఫ్గానిస్థాన్ మాజీ మంత్రి

Also Read

AP Assembly: విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

Viral Photo: పూజ గదిలో వొడ్కా బాటిల్‌ .. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో.. అమ్మలు అంతే అంటున్న నెటిజన్లు

Andhra Pradesh: మరెక్కడా లేని విధంగా ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్‌.. స్పష్టం చేసిన సర్కార్

Latest Articles
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..