Andhra Pradesh: మరెక్కడా లేని విధంగా ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్‌.. స్పష్టం చేసిన సర్కార్

రాష్ట్రంలో మూడేళ్లుగా ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదంటోంది ఏపీ ప్రభుత్వం. క్వాలిటీ టెస్టింగ్‌ 115 శాతం పెరిగిందని చెబుతోంది.

Andhra Pradesh: మరెక్కడా లేని విధంగా ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్‌.. స్పష్టం చేసిన సర్కార్
Telangana Liquor
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2022 | 8:39 AM

ఏపీలో 2019లో ఉన్న డిస్టిలరీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొత్తగా ఎలాంటి డిస్టిలరీలకి అనుమతి ఇవ్వలేదని స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ(Rajat Bhargava) స్పష్టం చేశారు. రాష్ట్రంలో చివరి డిస్టలరీ పర్మిషన్‌ 2019 ఫిబ్రవరిలో ఇచ్చారు. తర్వాత ఒక్క కొత్త డిస్టిలరీ కూడా రాష్ట్రంలో ఓపెన్‌ కాలేదన్నారు భార్గవ. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఏపీ ప్రభుత్వం(AP Government) 2020 మేలో కొత్త పాలసీ తెచ్చింది. బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించింది. షాపుల టైమింగ్‌ తగ్గించింది. ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ కట్టడికి పెంచిన రేట్లు తగ్గించింది. మరెక్కడా లేని విధంగా మద్యం క్వాలిటీ టెస్టింగ్‌ ఏపీలో జరుగుతోందన్నారు భార్గవ. ఏపీలో 2014 నుంచి 2018 మధ్య ఏడాదికి 99 వేల శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. అదే 2020-21లో 1.55 లక్షల శాంపిల్స్‌ను టెస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1.47 లక్షల శాంపిల్స్‌ టెస్ట్‌ చేశామంటోంది ప్రభుత్వం. ఏడాదికి లక్షా 60 వేల శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయాలన్నది లక్ష్యంతో ఉంది. 2014 నుంచి 2019 మధ్య గణాంకాలతో పోలిస్తే ఏపీలో ఐఎంఎఫ్‌ఎల్‌ సేల్స్‌ 30 శాతం తక్కువగా ఉన్నాయి. అలాగే కెమికల్‌ టెస్టింగ్‌లు 115 శాతం పెరిగాయి. ఇక 2020 మేలో ‘సెబ్‌’ ఏర్పాటు చేసినప్పటి నుంచి 12.5 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యంపై 93,722 కేసులు పెట్టి 70 వేల మందిని అరెస్ట్‌ చేశారు.

Also Read: బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు

Snake: పాములు పగబడతాయా? చంపేవరకు వదలవా? వాటికి పగా, ప్రతీకారాలు ఉంటాయా?