Shocking: అక్కడ కేజీ చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35 రూపాయలు.. కిలో ఉల్లిపాయలు 250

కేజీ చికెన్ వెయ్యి. ఒక్కో గుడ్డు 35 రూపాయలు. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 రూపాయలు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? వినడానికే ఆశ్చర్యంగా ఉంటే, మరి కొనేవాళ్ల పరిస్థితి ఏంటీ?

Shocking: అక్కడ కేజీ చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35 రూపాయలు.. కిలో ఉల్లిపాయలు 250
Chicken Price In Sri Lanka
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2022 | 10:46 AM

కరోనా(Corona) దెబ్బకు అన్ని దేశాలతో పాటు శ్రీలంక( Sri Lanka)కూడా లాక్ డౌన్‌(Lockdown)లోకి వెళ్లింది. ఫలితంగా అక్కడి ప్రధాన పరిశ్రమలు టీ, వస్త్రాలు, పర్యాటకం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదాయం లేక, దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణించింది. సెంట్రల్ బ్యాంక్ దగ్గరున్న విదేశీ మారక ద్రవ్య విలువలు పడిపోయాయి. ఈ కొరత దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ కారణంగా విదేశీ మారక ధరలు పెరిగాయి. తాజాగా శ్రీలంకన్ కరెన్సీలో 230 రూపాయలుగా ఉన్న యూఎస్ డాలర్ విలువ 270కి పెరిగింది. దీంతో, శ్రీలంకలో వస్తువులు ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. పరిస్థితి అదుపులో లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపయ్యాయి. వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. నిత్యావసరాల కోసం ప్రజలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. కేజీ చికెన్ వెయ్యి రూపాయలు, ఒక్కో గుడ్డు 35 రూపాయలు, కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 రూపాయలు అయ్యాయి. పెట్రోల్‌ బంకుల వద్ద వేల వాహనాలు బారులు తీరుతున్నాయి.

1970లలో సిరిమావో బండారు నాయకే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీలంకలో కరువు ఏర్పడిందని చెబుతారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం దానికంటే దారుణంగా ఉందని చాలామంది అంటున్నారు. ఈ పరిస్థితి వల్ల పేదవారి నుంచి ధనికుల వరకూ అందరూ ప్రభావితులయ్యారు. 90శాతం రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. కర్రల పొయ్యి పై వంట చేసే కొన్ని చిన్నచిన్న రెస్టారెంట్లు మాత్రం నడుస్తున్నాయి. శ్రీలంకకు గ్యాస్ సరఫరా చేసే లిట్రోగ్యాస్, లాఫ్స్ గ్యాస్ తాత్కాలికంగా సరఫరాను నిలిపేశాయి. ఈ ఆర్ధిక సంక్షోభం నడుమ, శ్రీలంకలో తీవ్రమైన విద్యుత్ కోత కొనసాగుతోంది. ప్రతిరోజూ గంటల పాటు కరెంటు సరఫరా ఉండటం లేదు. దీంతో వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు, పరిశ్రమలు ప్రభావితమవుతున్నాయి. కరెంటు లేనప్పుడు జనరేటర్లను వాడటం సాధారణమే కానీ, డీజిల్ కొరత వల్ల అలా వాడే అవకాశం కూడా ఉండటం లేదు.

Also Read: బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు