Viral: బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు

మనిషి భూమిపై తిన్నగా బ్రతకడం లేదు. ఈ భూమి అంతా తనదే అన్న భ్రమలో బ్రతికేస్తున్నాడు. అందరం ఇక్కడే గెస్టులం అనే అసలు నిజాన్ని మర్చిపోయాడు.

Viral: బార్డర్ వద్ద అనుమానాస్పదంగా  డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు
U.S. Customs and Border Protection
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 21, 2022 | 5:13 PM

మనిషి భూమిపై తిన్నగా బ్రతకడం లేదు. ఈ భూమి అంతా తనదే అన్న భ్రమలో బ్రతికేస్తున్నాడు. అందరం ఇక్కడే గెస్టులం అనే అసలు నిజాన్ని మర్చిపోయాడు. సాటి జీవులకు ఇక్కడ బ్రతికే స్వేచ్ఛ, హక్కు ఉందనే విషయాన్ని గాలికి వదిలేశాడు. ఈ మధ్య కాలంలో అరుదైన జీవుల అక్రమ రవాణా ఏ రేంజ్‌లో జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కాలిఫోర్నియాలో ఇదే తరహా స్మగ్లింగ్ వెలుగుచూసింది.  అమెరికా సరిహద్దు ఏజెంట్లను చిక్కకుండా.. అంతరించిపోతున్న పాములు, బల్లులను అమెరికాకు స్మగ్లింగ్ చేసేందుకు ఓ కేటుగాడు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. దుస్తులలో 52 అరుదైన బల్లులు, పాములను దాచి.. బార్డర్ దాటేందుకు యత్నించాడు. కానీ అతగాడి ప్రవర్తనపై అనుమానం రావడంతో.. అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో బాగోతం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 25న మెక్సికో శాన్ యసిడ్రో సరిహద్దు క్రాసింగ్ వద్దకు ఓ వ్యక్తి ట్రక్కును నడుపుతూ వచ్చాడు. మాములు తనిఖీలు చేసిన అధికారులు.. ఆ ట్రక్ డ్రైవర్ తడబాటు చూసి  పూర్తి స్థాయిలో చెక్ చేయగా.. బట్టల్లో కనిపించకుండా దాచిన తొమ్మిది పాములు, 43 కొమ్ముల బల్లులు కనిపించాయి. అవన్నీ బ్రతికే ఉన్నాయి. జాకెట్లు, ప్యాంటు పాకెట్లు, లో దుస్తుల్లో వాటిని కట్టి ఉంచినట్లు  US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. జీవుల ఆరోగ్యం, భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోకుండా, వాటిని అక్రమంగా అమెరికాకు తీసుకురావడానికి నిందితుడు ప్రయత్నించాడని తెలిపారు.  నిందితుడు.. అమెరికా పౌరుడని.. అతడి వయస్సు 30 ఏళ్లు అని తెలిపారు.

Also Read: Snake: పాములు పగబడతాయా? చంపేవరకు వదలవా? వాటికి పగా, ప్రతీకారాలు ఉంటాయా?