సంబురాలు చేసుకున్న కొద్ది గంటల్లోనే హాహాకారాలు.. విషాదం నింపిన కార్నివాల్ వేడుకలు

బెల్జియం (Belgium) కార్నివాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రాజధాని బ్రస్సెల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని..

సంబురాలు చేసుకున్న కొద్ది గంటల్లోనే హాహాకారాలు.. విషాదం నింపిన కార్నివాల్ వేడుకలు
Belgium Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 20, 2022 | 8:30 PM

బెల్జియం (Belgium) కార్నివాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రాజధాని బ్రస్సెల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని స్ట్రెపీ-బ్రాక్వెగ్నీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా కార్నివాల్ వేడుకలు జరగలేదు. ఈసారి కరోనా వ్యాప్తి తగ్గడంతో సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదం (Tragedy) నింపింది. కారు వేగంగా వెనక్కి ప్రయాణించి.. గుమిగూడి ఉన్న కొందరిపైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని నగర మేయర్ జాక్వెస్ గోబర్ట్ వెల్లడించారు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ (Arrest) చేశారు. పోలీసులు వెంటపడటంతో ఆ కారు వేగంగా వెనక్కి వచ్చి జనంపైకి దూసుకెళ్లినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆ దేశ అధికారులు దీనిని ఖండించారు. కాగా, ఎంతో ఆనందంగా జరగాల్సిన కార్నివాల్‌ విషాదంగా మారిందని బెల్జియం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రంగలోకి దిగనున్న ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు

RRR: మూవీ లవర్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. ఆ ఫార్మాట్‌లో కూడా విడుదల..

Football Gallery Collapse: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు.. షాకింగ్ వీడియో..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ