NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రంగలోకి దిగనున్న ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు
నెక్ట్స్ వీకెండ్‌లో చెర్రీతో కలిసి జాయింట్‌గా పాన్ ఇండియా సౌండ్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత జస్ట్.. ఒక్క నెల గ్యాప్ తీసుకుని సోలోగానే ఏకంగా రెండుసార్లు బీటౌన్‌ని కుదిపెయ్యబోతున్నారట.
NTR: నెక్ట్స్ వీకెండ్‌లో చెర్రీతో కలిసి జాయింట్‌గా పాన్ ఇండియా సౌండ్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత జస్ట్.. ఒక్క నెల గ్యాప్ తీసుకుని సోలోగానే ఏకంగా రెండుసార్లు బీటౌన్‌ని కుదిపెయ్యబోతున్నారట. సింగిల్ మంత్‌లో డబుల్ ధమాకా.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అక్కడ ఉంది యంగ్ టైగర్ మరి. ట్రిపులార్‌లో తనకు హీరోయిన్ లేకుండా చేశాడని జక్కన్న మీద ఆవిధంగా అలిగేశారు ఎన్టీయార్. నిజమే మరి.. ఏ స్టార్ హీరోకి రాని, రాకూడని బాధ ఇది. అయితే.. నెక్స్ట్ లైనప్‌లో ఇంతకింతా తీర్చుకుంటాననే కమిట్‌మెంట్ అయితే కనిపిస్తోంది తారకరాముడి దగ్గర. ఒకేసారి ఇద్దరు బాలీవుడ్ భామల్ని లైన్లో పెట్టబోతున్నారు ఎన్టీయార్.
కోవిడ్‌తో వచ్చిన గ్యాప్‌లో రెండు సినిమాలు అనౌన్స్ చేసి, ఒక సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టి, కియారాతో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ రిపీట్ చేస్తున్నారు చెర్రీ. ఇన్నాళ్లూ సైలెంట్‌గా వున్న తారక్ మాత్రం ట్రిపులార్ ప్రమోషన్ వర్క్ కంప్లీట్ కాగానే.. గెట్‌సెట్ గో అంటారట. ఏప్రిల్ మంత్‌లో ఒకేసారి రెండు సినిమాల్ని మొదలుపెట్టబోతున్నారు. కొరటాలతో ఇప్పటికే అనౌన్స్‌చేసిన తన థర్టీయత్ మూవీ ముహూర్తం ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో వుండే ఛాన్సుంది. ఇందులో హీరోయిన్‌గా ఆలియా భట్ పేరు దాదాపుగా ఖరారైంది.
ఆ వెంటనే… ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు లైన్‌లో వున్నారు. ఎన్టీయార్‌తో మైత్రీ బేనర్‌పై ఒక స్పోర్ట్స్ డ్రామాను ఓకే చేసుకుని… ప్రిప్రొడక్షన్ వర్క్ ఫినిషి చేశారు బుచ్చిబాబు. ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ముహూర్తంతో పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలయ్యే ఛాన్సుందట. పెద్ది అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో డాటరాఫ్ శ్రీదేవి జాన్వీకపూర్ ఎన్టీయార్‌కి జోడీగా నటిస్తారని నార్త్ ఫిలిమ్ సర్కిల్స్ కూడా కన్‌ఫమ్ చేశాయి. సో… ఈ లెక్కన ఇద్దరు హిందీ భామలతో లాంగ్ డ్రైవ్‌కి రెడీ ఔతున్నారన్నమాట ఎన్టీయార్.
మరిన్ని ఇక్కడ చదవండి :